15తులాల బంగారం ఆభరణాల చోరీ | - | Sakshi
Sakshi News home page

15తులాల బంగారం ఆభరణాల చోరీ

Aug 3 2026 12:55 AM | Updated on Aug 3 2026 12:55 AM

15తులాల బంగారం ఆభరణాల చోరీ

సీతానగరం: మండల కేంద్రంలోని ప్రధాన మార్కెట్‌లో మెయిన్‌ రోడ్డును ఆనుకుని నివాసం ఉంటున్న కూర్మదాసు కిరణ్‌ ఇంట్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 15 తులాల బంగారం ఆభరణాలు చోరీ చేసినట్లు ఎస్సై ఎం.హేమలత తెలిపారు. ఆదివారం ఉదయం నిద్ర లేచిన అనంతరం ఇంట్లో తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి బీరువా తెరిచే సరికి అందులో భద్రపర్చిన బంగారం నగలు లేవపోవడాన్ని గుర్తించి ఇరుగు పొరుగువారికి తెలియజేసి, బాధితుడు కిరణ్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని క్లూస్‌టీమ్‌ సందర్శించి వేలిముద్రలను సేకరించినట్లు ఎస్సై చెప్పారు. మార్కెట్‌లో దొంగతనం జరిగిన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినట్లు తెలిపారు. పార్వతీపురం సీఐ రంగనాథ్‌ ఆధ్వర్యంలో కేసుమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హేమలత తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement