● మక్కువ రెవెన్యూ అధికారులపై మండిపడిన ఆర్డీఓ ● ఒకరికిచ్చిన పట్టాపై మరొకరికి పొజిషన్ పట్టా ఎలా ఇచ్చారు?
మక్కువ:
ఓ వ్యక్తికి అందించిన ఇంటి పట్టాపై.. అదే స్థలంలో మరో వ్యక్తికి ఎలా పొజిషన్ పట్టా ఇచ్చా రు? దీని వల్ల రెండు కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని మీకు తెలియదా..! ఈ విషయంలో మీపై సీఎంఓకు రిపోర్టు రాస్తానంటూ పార్వతీపు రం ఆర్‌డీఓ కె.మాధురి మక్కువ రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. మండలంలోని చెముడు గ్రామానికి చెందిన బొద్దూరు కృష్ణకి గత జగనన్న ప్రభుత్వం లేఔట్‌లో 84/11లో ఇంటి పట్టా మంజూరు చేసింది. అదే స్థలంలో అదే గ్రామానికి చెంది న బుసాల సావిత్రి అనే మహిళకు రెవెన్యూ అధికా రులు 2024లో పొజిషన్ పట్టా మంజూరు చేశారు. దీంతో సావిత్రి కృష్ణకు మంజూరు చేసిన ఇంటి స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ సమస్యపై పలుమార్లు బొద్దూరు కృష్ణ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపో వడంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ ఏడాది ఏప్రిల్ 24న ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఆర్డీఓ మాధురి శుక్రవారం మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఒకరికి పట్టా ఇచ్చిన దానిపై వేరొకరికి పొజి షన్ పట్టా ఎలా ఇచ్చారు? పరిశీలన చేయకుండా ఇలా పొజిషన్ పట్టా ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ మండిపడ్డారు. అప్పటి తహసీల్దార్ హోదాలో పొజిషన్ పట్టా జారీ చేసిన ప్రస్తుత మక్కువ తహసీల్దార్ కార్యాలయ ఉప తహసీల్దార్ ఇబ్రహీంను ఆర్డీఓ ప్రశ్నించారు. వీఆర్‌ఓ, ఆర్‌ఐ రిపోర్టు మేరకు పొజిషన్ పట్టా ఇచ్చానని ఉప తహసీల్దార్ చెప్పడంతో వారి చెబితే కేసు స్టడీ చేయకుండా ఇచ్చేస్తారా? అంటూ నిలదీశారు. ఇందుకు బాధ్యులైన అందరిపై సీఎంఓకు రిపోర్టు రాస్తానని హెచ్చరించారు. మాన్యువల్ భూ రికార్డుల కంప్యూటరీకరణ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మక్కువ ఎంఎల్‌ఎస్ పాయింట్ తనిఖీ చేశారు.


