సీతానగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా ఎన్‌సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో అంతర్భాగమైన లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారానికి సంబంధించిన ఆస్తులపై శుక్రవారం పలుచోట్ల సీబీఐ అధికారులు సోదాలు జరిపినట్టు తెలిసింది. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, విజయనగరం, లచ్చయ్యపేటలో ఉన్న కంపెన్నీ కార్యాలయాల్లో సోదాలు చేసినట్టు సమాచారం. 2015 ఆర్ధిక సంవత్సరంలో నేషనల్ స్పాట్ (ఎన్‌ఎస్‌ఈఎల్) ఎక్సేంజ్ లిమిటెడ్ నుంచి రూ.155 కోట్ల రాసుగర్, మెటీరియల్, బొగ్గు వ్యాపారం నిమిత్తం ఎన్‌సీఎస్ యాజమాన్యం రుణం తీసుకుని 16 అకౌంట్లలోకి సర్దుబాటు చేసింది. తీసుకున్న రుణం సకాలంలో తీర్చక పోవడం, సంస్థ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఏదో కుంభకోణం జరిగిందన్న అనుమానంతో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. సోదాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.


