పర్యాటకానికి కేరాఫ్‌ పార్వతీపురం మన్యం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకానికి కేరాఫ్‌ పార్వతీపురం మన్యం

Jul 31 2026 2:09 AM | Updated on Jul 31 2026 2:09 AM

పర్యాటకానికి కేరాఫ్‌ పార్వతీపురం మన్యం అనారోగ్యంతో మరో చిన్నారి మృతి 2న రాష్ట్రస్థాయి జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

సీతంపేట: పర్యటకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా పార్వతీపురం మన్యం జిల్లా నిలుస్తుందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అన్నారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి మంగళవారం మన్యం సవారి బైక్‌ ర్యాలీ నిర్వహించా రు. స్థానిక అడ్వంచర్‌ పార్కు నుంచి సున్నపుగెడ్డ వరకు బైక్‌ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈస్ట్రన్‌ ఘాట్స్‌ గ్రీనరీ ఒక గ్రీన్‌ వరల్డ్‌లా కనిపిస్తుందని, పర్యాటకులు మేఘాల నడుమ ప్రయాణించేలా రైడ్‌ విత్‌ క్లౌడ్‌ అనుభూతిని అందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. కాంక్రీట్‌ జంగిల్‌ దాటి అడవుల్లో కనీసం 3 గంటలు సమయం గడిపితే శరీరానికి లభించే ఆక్సిజన్‌, ఆరోగ్యంపై పరిశోధనలు సైతం సానుకూల ప్రభావం చూపుతాయన్నా రు. సున్నపుగెడ్డ మార్గం లాంటి మరిన్ని పర్యా టక రూట్లను త్వరలోనే అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం సోమగండి గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పింఛన్లు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.మాధురి, డీఆర్‌ డీఏ పీడీ ప్రభావతి, తహసీల్దార్‌ శ్రీకన్య, ఎంపీ డీఓ మిశ్రో, తదితరులు పాల్గొన్నారు.

సాలూరు: అధికారుల నిర్లక్ష్యమో కూటమి ప్రభుత్వ వైఫల్యమో మన్యంలో మరో చిన్నారి అనారోగ్యంతో మృతి చెందింది. కేవలం జ్వరం వచ్చి సరైన చికిత్స అందక ఇటీవల చిన్నారులు మృత్యువాత పడుతున్న సంఘట నలు పాఠకులకు విదితమే. తాజాగా బుధవా రం సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు పంచాయతీ శిఖపరువు గ్రామానికి చెందిన మూడే ళ్ల చిన్నారి కేవలం జ్వరంతో సరైన చికిత్స అందక మరణించింది. వివరాల్లోకి వెళితే శిఖపరు వు గ్రామంలో నివాసముంటున్న కూనేటి రా ము, జానులకు ఒక్కగానొక్క కుమార్తె మేరీ. మేరీకి ఈ నెల 27వ తేదీన జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక తోణాం పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. పీహెచ్‌సీలో చిన్నారికి వైద్యపరీక్షలు చేయగా టైఫాయిడ్‌, మలేరియా నెగటివ్‌ వచ్చిందని వైద్యసిబ్బంది చెబుతున్నారు. చికి త్స అందించేందుకు ఆస్పత్రిలో ఉండాలని వైద్యసిబ్బంది చిన్నారి తల్లిదండ్రులకు సూచించారు. అయితే తమ గ్రామం దగ్గరే కావున వచ్చి చికిత్స తీసుకుంటామని చెప్పి పాపను తల్లిదండ్రులు ఇంటికి తీసుకు వెళ్లిపోయారు. 27 సాయంత్రం, 28న ఉదయం, సాయంత్రం చిన్నారిని పీహెచ్‌సీకి తీసుకురాగా వైద్యం అందించారు. 29 ఉదయం తమ గ్రామం నుంచి పీహెచ్‌సీకి వెళ్లేందుకు వాహనం ఏమీ రాకపోవ డం, తల్లిదండ్రులిద్దరు జలుబు, జ్వరంతో ఉండడంతో చిన్నారిని పీహెచ్‌సీకి తీసుకువెళ్లలేకపోయారు. ఈలోగా చిన్నారికి ఇంటి వద్దే విరో చనాలై మరణించింది. గురువారం శిఖపరువు గ్రామానికి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పద్మావతి వెళ్లి వైరల్‌ జ్వరంతో మృతి చెందిన చిన్నా రి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైరల్‌ జ్వరంతో చిన్నారి మరణించిందని, ఆమె తల్లిదండ్రులు జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని తెలియజేశా రు. అయితే ఇదే గ్రామంలో సబ్‌సెంట ర్‌ ఉన్నప్పటికీ గ్రామంలో చిన్నారి అనారోగ్యంతో మరణించడంపై ప్రజల నుంచి పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆగస్టు 2న నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు లీలాకృష్ణ, శ్రీకాంత్‌ గురువా రం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి నగర శివారులోని విజ్జీ స్టేడియం ప్రాంగణంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయ ని పేర్కొన్నారు. అండర్‌–14, 16, 18, 20 విభాగాల్లో బాల, బాలికలకు రన్స్‌, త్రోస్‌, జంప్స్‌ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చేనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement