శ్రమదోపిడీ చాలు
బలిజిపేట: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగు ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి మహిళలు నడుం బిగించారు. దశాబ్దాలుగా వెట్టిచాకిరీ చేస్తున్నా న్యాయం జరగడం లేదన్న బాధతో రగి లిపోతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వారికిచ్చే వేతనంలో తమకు పావు వంతు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు.
పాదయాత్ర, ఎన్నికల హామీ నెరవేర్చాలి
ఎన్నికల ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత, రెగ్యులర్ కాని పక్షంలో మినిమమ్ టైం స్కేలు వంటి పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చా రు. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచి నా సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏరుదాటిన తరువాత తెప్ప తగలేయడం అంటే ఇదే అని వారు మండిపడుతున్నారు.
వారి డిమాండ్లు ఇవే:
సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలి. హెచ్‌ఆర్ పాలసీని అమలుచేయాలి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. కానిపక్షంలో మినిమం టైం స్కేలు వర్తింపచేయాలి. ఉద్యోగ విరమణ వయస్సును 60నుంచి 62ఏళ్లకు పెంచడంతో పాటు ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అందజేయాలి. ఉద్యో గ భద్రతతో పాటు పెన్షన్, ఈఎస్‌ఐ, సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. డీఎస్సీ, ప్రభుత్వ రెగ్యులర్ పోస్టుల నియామకాల్లో వెయిటేజీ కల్పించాలి. రాష్ట్ర హైకో ర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సమస్యలను పరిష్కరించాలని పలుపర్యాయాలు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ఈ నెల 30, 31తేదీల్లో కలెక్టరేట్ వద్ద ధర్నాకు శ్రీకా రం చుట్టారు. సీఐటీయూ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
దశాబ్దాలుగా చేస్తున్న శ్రమదోపిడీ ఇకచాలు. న్యాయపరమైన కోరికలను నెరవేర్చాల్సిందే. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయాలి. డిమాండ్ల పరిష్కారానికి 30, 31తేదీలలో కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహిస్తాం.
–మన్మథరావు, సీఐటీయూ
జిల్లా ప్రధానకార్యదర్శి, బలిజిపేట


