డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రం ప్రారంభం
సీతానగరం: శాసీ్త్రయ, మానవీయ, సుస్థిర పద్ధతుల ద్వారా ప్రజలను, అటవీ మృగాలను రక్షంచడమే ప్రభుత్వ సంకల్పమని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె.పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో అప్పయ్యపేట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్ర శిలాఫలకాన్ని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ బుధవారం పర్చువల్ విధానంలో అమరావతి నుంచి ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి మనది కాదని మనమే ప్రకృతికి చెందిన వారమని, మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రకృతిపై సమానమైన హక్కు ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో ఇచ్చి న హామీని నేడు అమలు చేశామన్నారు. మంత్రిగుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఏనుగులవల్ల ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా చూడాలన్న ప్రజలకల నేటికి నెరవేరిందన్నారు. అందుకు కుంకీ ఏనుగులు దోహద పడతాయన్నారు. కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్‌డ్డి మాట్లాడుతూ మన్యం జిల్లావాసులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసి ముగింపు పలకడం ఆనందదాయక మన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బి.విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి, ఆర్డీఓ కె. మాధురి, జిల్లా అటవీ శాఖఅధికారి ప్రసూన, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సీహెచ్ దీనకుమార్, అటవీ అధికారి రవికుమార్, మనోజ్‌కుమార్, ఏనుగుల పర్యవేక్షణ అధికారి మణికంఠేష్ తదితరులు పాల్గొన్నారు.


