సాలూరు రూరల్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం శ్రీకాకుళం వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డికి స్వాగతం పలికేందుకు నాతవల స కూడలి వద్దకు సుమారు 30 కార్లతో సాలూ రు నియోజకవర్గం నుంచి ఉదయం 9 గంటల ప్రాంతంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బయలదేరనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం జన్నదొర తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడు తూ రాజకీయ కుట్రలతో సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేయడంతో ఆయనకు ధైర్యం చెప్పేందుకు జగన్‌మోహన్ రెడ్డి వస్తున్నారన్నారు. ఆపదలో ఉన్న వారికి తానున్నానంటూ ధైర్యం చెప్పేందుకు జగన్ మోహన్ రె డ్డి వస్తున్నారన్నారు. సాలూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని రాజన్నదొర కోరారు.
పాచిపెంట: ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ధింసా నత్య ప్రదర్శనలో పాల్గొనేందుకు పాచిపెంట మండలంలోని పలు గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులను బుధవారం ఎనిమిది బస్సుల్లో తరలించారు. ఈ బస్సులను పి.కోనవలస వద్ద గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు.
సీతంపేట నుంచి..
సీతంపేట: భోగాపురంలో ధింసా నృత్యం చేయడానికి సుమారు 2 వేల మంది విద్యార్థులను అధికారులు బుధవారం తరలించారు. ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగనున్న విషయం విదితమే. ఈ సందర్భంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గురుకుల, ఆశ్రమ పాఠశాలల గిరిజన విద్యార్థులను ఆర్టీసీ బస్సుల్లో తరలించారు.
రేగిడి: మండల పరిధిలోని లచ్చన్నవలస ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న మంతిన హేమలత బ్రెయిన్ స్ట్రోక్‌తో బుధవారం మృతిచెందినట్లు ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. ఈ నెల 24న పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ డే సమావేశం నిర్వహించిన సమయంలో ఆమె అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మెదడులో రక్తనాళాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారని ఎంఈఓ వెల్లడించారు.


