మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ | - | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ

Jul 29 2026 1:04 AM | Updated on Jul 29 2026 1:04 AM

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ

మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పాలనే బాధ్యతతోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టాం. దేశంలో పేపర్‌ లీకేజీ వ్యవహారంపై యువత రోడ్డెక్కితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏ విధంగా రాజీనామా చేశారో... ఇక్కడ రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కచ్చితంగా రాజీనామా చేయాలని విద్యార్థి లోకం తరపున డిమాండ్‌ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడుకు సూటిగా చెబుతున్నాం.. మీ ప్రభుత్వంలో ఒక మంత్రి శాఖలో అవినీతి జరిగితే, నిరుద్యోగులతో చెలగాటం ఆడితే ఇప్పటివరకు మీరెందుకు స్పందించలేదు? విద్యార్థులంటే మీకంత చిన్నచూపా? మీ కొడుకు ’మాలోకం’ చేసిన ఘనకార్యాలను ఒకసారి పరిశీలించి, తక్షణమే ఆయన్ని బర్తరఫ్‌ చేయండి. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేలు, మహిళలకు రూ.1500 ఏమయ్యాయి? ప్రతి జనవరిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యా దీవెన, వసతి దీవెన ఊసేలేదు. జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు ’ఇంటికో అబద్ధం’ అనే కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తోంది. మన్యం జిల్లాలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు నిలదీయాలి. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement