ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ లీకేజీపై దేశ యువత, జెన్–జీ పోరాటం అసా ధారణం. వ్యవస్థలో తప్పులు చేయవచ్చు. వాటిని పార్టీలకు అతీతంగా ప్రశ్నించడం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రస్తుతం మన రాష్ట్రంలో డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా కింద అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టడం ద్వారా విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. క్వాలిటీలేని ఉపాధ్యాయులు వస్తే రాబోయే తరాల భవిష్యత్తు అంధకారమవుతుంది. అమరావతి, ఎయిర్‌పోర్ట్‌లు అంటున్న పాలకులు.. సామాన్యుల సమస్యలను విస్మరిస్తున్నారు. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా ఏకమై శాంతియుతంగా గళమెత్తాలి.
– శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు


