ప్లకార్డుతో నిరసన
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్:
మెగా డీఎస్సీ–2025లో అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాలు డిమాండ్ చేశాయి. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని, వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులు చెల్లించాలని, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందించాలని డిమాండ్ చేస్తూ.. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. వందలాది మందితో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న వైఎస్సార్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు.
డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్
మన్యంలో హోరెత్తిన నిరసన


