● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు పిలుపు
జియ్యమ్మ వలస రూరల్: రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖలో లొసుగులను బయటకు తీసేందుకు, అలాగే డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యుడైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైఖరిపై నిలదీసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జరగనున్న విద్యార్థి, యువజన ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు పిలుపునిచ్చారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, నీట్ పేపర్ లీకేజీ, ఫీజు రీయింబ ర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి మొదలైన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు పార్వతీపురం కాంప్లెక్స్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.


