పార్వతీపురం:
జిల్లాలో జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న తాగునీటి, పారిశుధ్య పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవా రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో తాగునీటి, పారిశుధ్య సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అవసరమైన చోట కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల కోసం ప్రతిపాదనలు పంపాలని, గ్రామస్థాయి వాటర్ అండ్ శానిటేషన్ కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి వివరాలను జలజీవన్ మిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా నీటి సరఫరా, పారిశుధ్య మిషన్ అధికారి పి.మధుకుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


