న్యూస్‌రీల్
ఆరుబయటే భోజనాలు
ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి, పార్వతీపురం మన్యం/మక్కువ/పాచిపెంట: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం కింద పలు పాఠశాలలను ఎంపిక చేసి అక్కడ మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు... వారిలో నైపుణ్యాభివృద్ధికి ఎలక్ట్రికల్, ఆటోమోటివ్, బ్యాంకింగ్ వృత్తివిద్య కోర్సు లను.. క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేసి వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో వంటి క్రీడల్లో తర్ఫీదు, అవసరమైన సామగ్రి పంపిణీ, శుద్ధ జల ప్లాంటు, గ్రంథాలయాల ఏర్పాటు, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, ల్యాబ్‌ల ఏర్పాటు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ.. ఇలా అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది. ఒక్కో పాఠశాలకూ సౌకర్యాల కల్పన కోసం సుమారు రూ.3 కోట్ల వరకూ నిధులు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో మక్కువ, పాచిపెంట మండలం పాంచాలి, పాలకొండ, అన్నవరం, సీతంపేట, వీరఘట్టం, భామిని, సాలూరు, పురో హితునివలస, పార్వతీపురం తదితర ప్రాంతాల్లోని పురపాలక ఉన్నత, ప్రాథమిక, జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆదర్శ.. ఇలా మొత్తం 20 పాఠశాలలను పీఎంశ్రీకి ఎంపిక చేశారు. రూ.లక్షలు వెచ్చించి పీఎంశ్రీకి ఎంపికై న పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కేంద్ర ఆశయం జిల్లాలో పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసేస్తున్నారు. కొన్ని చోట్ల అరకొర పనులతోనే మమ అనిపిస్తున్నారు. జిల్లా విద్యా శాఖాధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు కుమ్మకై ్క నిధులను కై ంక్యర్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు కూడా అధికార పార్టీకి చెందిన వారే చేసుకుంటున్నారు.
పాచిపెంట మండలం పాంచాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2023–24 విద్యా సంవత్సరానికి పీఎంశ్రీ పథకానికి ఎంపికై ంది. ఈ పథకం కింద పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కోసం సుమారు రూ.32 లక్షల నిధులు మంజూర య్యాయి. వర్షపు నీటి సంరక్షణ కోసం నాలుగు ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.లక్ష, కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు రూ.1.50 లక్షలు, రాంప్స్ అండ్ రైలింగ్ పనుల కోసం రూ.1.25 లక్షలు, లైబ్రరీ రూమ్ నిర్మాణానికి రూ.23,10,000 మంజూరయ్యాయి. పాఠశాలలో జరిగిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు.. పనుల వాస్తవ స్థితి, వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. చాలా వరకు పనులు చేయకుండానే నిధులు డ్రా చేసుకున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ వర్కులకు సంబంధించి బిల్లులు మొత్తం పాంచాలి మాజీ సర్పంచ్, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు గూడెపు యుగంధర్ కుమార్ పేరిట చెల్లించడం గమనార్హం.
మక్కువ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 537 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ కూడా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పాఠశాల ప్రహరీ కూలిపోయింది. మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. 50 శాతం మంది విద్యార్థినులకు ఒక్కచోటే మరుగుదొడ్లు ఉన్నాయి. ఆరుబయట చెట్ల కింద వంటలు చేస్తున్నారు. డైనింగ్ హాల్ లేకపోవడంతో, క్యూలో నిలబడి ప్లేట్లు పట్టుకొని భోజనం కోసం విద్యార్థులు పాట్లు పడుతున్నారు.
పీఎం శ్రీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు టీ షర్టులు, యోగా మేట్ల కాంట్రాక్టును విద్యాశాఖలో పనిచేస్తున్న శంకరరావు భార్య సంస్థకు అప్పనంగా అప్పగించారు. రూ.19 లక్షల విలువైన కాంట్రాక్టును టెండరు కూడా లేకుండా ఏక పక్షంగా కట్టబెట్టారు. సామగ్రి ఇవ్వకుండానే బిల్లులు కూడా చెల్లించడం గమనార్హం. విద్యాశాఖ వైఖరిని డీఆర్సీ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి తప్పుబట్టారు.
అరకొర పనులతో పీఎం శ్రీ నిధులు స్వాహా?
టెండర్లు కూడా అయినవారికే..
మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు


