గిరిజనాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది... అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు.. రోడ్లు అధ్వానంగా మారాయి.. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదంటూ కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ జాకరగూడ గిరిజనులు, ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి బి.అనిల్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జాకరగూడ రోడ్డుపై వరినాట్లు వేస్తూ, రోడ్డుపై ఉన్న నీటిలో స్నానం చేస్తూ నిరసన తెలిపారు. జాకరగూడ నుంచి అధ్వానంగూడ, సంజువాయి గ్రామాల వరకు మూడు కిలోమీటర్ల రోడ్డును బాగుచేయాలని డిమాండ్ చేశారు. – కురుపాం


