కట్టెల పొయ్యిలపైనే వంటలు | - | Sakshi
Sakshi News home page

కట్టెల పొయ్యిలపైనే వంటలు

Jul 26 2026 2:38 AM | Updated on Jul 26 2026 2:38 AM

కట్టెల పొయ్యిలపైనే వంటలు

మక్కువ మండలం ములక్కాయవలస పీఎంశ్రీ ఏపీ మోడల్‌ పాఠశాలలో 617 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారిలో సుమారు 94 మంది విద్యార్థినులు వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. ఇక్కడ గ్యాస్‌తో కాకుండా, కట్టెలతో వంటలు చేస్తున్నారు. పాఠశాలలో నిల్వ ఉన్న కట్టెలు, టింబర్‌ డిపోను తలపిస్తున్నాయి. ఆరుబయట వంటలు సాగిస్తున్నారు. పీఎంశ్రీ నిధులతో ఆర్‌ఓ ప్లాంట్‌ మంజూరైనప్పటికీ, కేవలం ఇన్స్టాల్‌ చేసి, పైపులకు కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు దొరకడంలేదు. బోరు నీరే ఆధారం అవుతోంది.

● మరుగుదొడ్లు పక్కనే ఉన్న ట్యాప్‌ల వద్ద భోజనం చేసిన కంచాలు (ప్లేట్లు) శుభ్రం చేసుకుంటున్నారు. మరుగుదొడ్ల నుంచి దుర్వాసన వెదజల్లుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement