గజరాజుల సంచారంతో భయాందోళనలు | - | Sakshi
Sakshi News home page

గజరాజుల సంచారంతో భయాందోళనలు

Jul 26 2026 2:38 AM | Updated on Jul 26 2026 2:38 AM

బాడంగి: వారం రోజులుగా గజరాజుల గుంపు మండలంలో తిష్టవేసి పినపెంకి – ఆకులకట్ట పరిసరాల పొలాల్లో తిరుగాడుతుండడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. గ్రామాల్లోకి చొరబడకుండా అటవీ శాఖ, పోలీసు సిబ్బంది కపలా కాస్తున్నా.. పంట పొలాల్లోకి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. శనివారం గూడెపువలస నుంచి మల్లంపేట పొలాల మీదుగా పాల్తేరు పొలాలకు గజరాజులు చేరుకున్నాయి. అక్కడి ప్రజలు కర్రలతో వాటిని అదిలించగా రావివలస తోటలు, పొలాల్లోకి చేరకున్నాయి. మొత్తంగా మండలంలోనే సంచరిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement