పీజీఆర్‌ఎస్‌కు 23 వినతులు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 23 వినతులు

Jul 25 2026 12:59 AM | Updated on Jul 25 2026 12:59 AM

పీజీఆర్‌ఎస్‌కు 23 వినతులు విద్యా ప్రగతిపై చర్చించాలి ● పార్వతీపురం ఐటీడీఏ పీఓ ఆర్‌.వైశాలి అదుపుతప్పి కొండను ఢీకొన్న లారీ

సీతంపేట: ఐటీడీఏలో పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 23 అర్జీలు వచ్చాయి. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టా వివరాలను గిరిభూమి పోర్టల్‌లో నమోదు చేయాలని చిన్నసున్నాపురానికి చెందిన కోట వరహాలమ్మ కోరింది. అన్నదాత సుఖీబవ మొత్తం ఇప్పించాలని రేగులగూడ, బూతలగూడకు చెందిన సవర రాదమ్మ, సవర సోంబారమ్మ వినతి అందజేశారు. అడ్డంగి గ్రామానికి సెల్‌టవర్‌ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేశారు. సీతంపేట సెంటర్‌లో సులభ్‌ కాంప్లెక్స్‌ను ప్రయాణికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం: విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చించాల్సిన అవసరం ఉందని పార్వతీపురం ఐటీడీఏ పీఓ ఆర్‌.వైశాలి అన్నారు. గుమ్మలక్ష్మీ పురం మండలం టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొ ని మాట్లాడారు. పిల్లల భవిష్యత్తును తీర్చిది ద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంగా ఉండాలని సూచించారు. అనంత రం ఆమె పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదిని పరిశీలించారు. అనంతరం పాఠశాల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి విద్యార్థులకు నిరంతర విద్యుత్‌, తాగునీరు, పరిశుభ్రమైన వాతావర ణం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జ్ఞానప్రకాష్‌, డిప్యూటీ వార్డెన్‌ వెంకటరావు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

● క్లీనర్‌ మృతి, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పాచిపెంట: మండలంలోని పి.కోనవలస ఘాట్‌ రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్‌ దుర్మరణం చెందగా, డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన లారీ జగదల్‌పూర్‌ నుంచి రాజాం వైపు మొక్కజొన్న లోడుతో వెళ్తుండగా పి.కోనవలస ఘాట్‌ రోడ్డులో దుర్గగుడి సమీపంలోని ఒక్కసారిగా అదుపుతప్పిన లారీ కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌ పూర్తిగా నుజ్జునుజ్జ యింది. క్యాబిన్‌లో క్లీనర్‌ ఇరుక్కుపోయి అక్కడికక్కడే మతిచెందాడు. డ్రైవర్‌ రోహిత్‌ న్‌శ్యా మ్‌ గార్డే తీవ్రంగా గాయపడగా, స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీ సులు, 108లో సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్లీనర్‌ మతదేహాన్ని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు పాచిపెంట ఎస్సై అర్జున్‌ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement