పార్వతీపురంలోని డీవీఎం పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు–
ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు. ఆయన కలెక్టర్ హోదాలో కాక.. తండ్రి స్థానంలో హాజరు కావడం విశేషం.
తన కుమారుడు కూడా ఇదే పాఠశాలలో చదువుతుండడంతో, బాధ్యతాయుతమైన తండ్రిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతిపై ఇచ్చిన సందేశాన్ని, సూచనలను శ్రద్ధగా ఆలకించారు. అనంతరం సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో మాట్లాడి, విద్యార్థుల చదువు, ఇతర నైపుణ్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం


