అక్షరాలు దిద్దే బడుల వద్ద అడుగడుగునా ఖాకీల పహారా కొనసాగుతోంది. ఒకవైపు మెగా ‘పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్’ (పీటీఎం) సందడి, నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై వామపక్ష, విద్యార్థి సంఘాల బంద్ పిలుపు.. తల్లికి వందనం లబ్ధి జమకాని తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు పోలీసు వలయంలోకి మారాయి. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికే పోలీసులు మోహరించారు. ముఖద్వారాల వద్ద కాపలాకాశారు. బడులన్నీ పోలీసు పహారాలో దర్శనమివ్వడంతో తల్లిదండ్రులు విస్తుపోయారు.
–పార్వతీపురం రూరల్


