
ఆర్థిక ఇబ్బందుల్లో ఆదివాసీలు...
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తామని జీవో జారీ చేయడంతో పీఎం జన్‌మన్ పథకంలో గృహ లబ్దిదారులైన ఆదివాసీలు ఇంటి నిర్మాణాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు. ఇప్పుడు ఆ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి సర్కారు మాట నిలుపుకోకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణ సామగ్రి, కూలీల ఖర్చులు పెరగడం, కేంద్రం ఇచ్చే ప్రోత్సాహక నిధులు ఎటూ సరిపోక పోవడంతో ఇంటినిర్మాణాలు మద్యలో నిలిచిపోయే పరిస్థితి ఉందని గిరిజనులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి రూ.లక్షలను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు.