
అర్ధరాత్రి వరకూ తాగుకోండి!
న్యూస్‌రీల్
ఉమ్మడి జిల్లాలో ఇలా...
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025
బ్యానర్....
సాక్షి, పార్వతీపురం మన్యం :
మందుబాబులు ఇకపై అర్ధరాత్రి 12 గంటల వరకు బార్‌లో దర్జాగా కూర్చొని తాగేయవచ్చు. మద్యం అడ్డగోలు దోపిడీకి, సామాన్యుల జేబులు చిల్లు చేసేందుకు ప్రభుత్వమే ‘పర్మిట్’ ఇచ్చేసింది. బార్లు తెరిచే వేళలను మరో రెండు గంటలపాటు పెంచింది. ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇవి తెరిచే ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకే ఈ వేళలు ఉండేవి. నూతన బార్ల కోసం ఎకై ్సజ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మూడేళ్లపాటు ఉండే లైసెన్సుకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 26వ వరకు గడువిచ్చారు. 28వ తేదీన లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. నూతన విధానం ద్వారా ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి.. విచ్చలవిడిగా ఏనీటైం మద్యం లభ్యమయ్యేలా చేశారు. సిండికేట్‌లే ఇక్కడ చక్రం తిప్పి, అధిక దుకాణాలు దక్కించుకున్నారు. కూటమి నాయకులే ఎక్కువగా భాగస్వాములుగా ఉన్నారు. గొలుసు దుకాణాలకు వైన్స్ యాజమానులే తలుపులు తెరిచారు. ఇప్పుడు బార్‌లతో దొరికినంత దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ కూడా సిండికేట్‌లు వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నూతన పాలసీ అమల్లోకి రానుంది.
గతంలో విజయనగరం జిల్లా పరిధిలో 23, పార్వతీపురం మన్యంలో ఏడు చొప్పున బార్లు ఉండేవి. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో 28, పార్వతీపురం మన్యంలో ఎనిమిది ఏర్పాటు కానున్నాయి. నూతన మద్యం పాలసీ ప్రకారం వైన్‌షాపుల మాదిరి బార్లలోనూ కొన్ని కల్లుగీత కార్మికులకు కేటాయిస్తున్నారు. ఈ ప్రకారం విజయనగరంలో 3, పార్వతీపురంమన్యం జిల్లాలో రెండు కేటాయించారు. విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో 18, బొబ్బిలి మున్సిపాలిటీలో 4, రాజాం నగర పంచాయతీ 5, భోగాపురం వీఎంఆర్‌డీఏ పరిధిలో ఒకటితోపాటు.. గీత కార్మికులకు విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో 1, నెల్లిమర్ల 1, రాజాం 1 చొప్పున ఉన్నాయి. మన్యం జిల్లాలో మొత్తం పార్వతీపురం 4, సాలూరు 5, పాలకొండ 1 చొప్పున ఏర్పాటు కానున్నాయి. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఒక దరఖాస్తుకే రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక బార్ పొందడానికి లైసెన్సు ఫీజు రూ.55 లక్షలుగా నిర్ణయించారు.
రోజులో 14 గంటలు బార్లు తెరిచే ఉంటాయ్..
నూతన బార్లకు నోటిఫికేషన్ విడుదల