పోలీసు శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

పోలీసు శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం వైఎస్సార్‌ సీపీ యువజన నాయకుడు అక్రమ అరెస్టు

జేసీకి వినతిపత్రం సమర్పించిన ఏఐవైఎఫ్‌ నాయకులు

నరసరావుపేట: పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న 11,639 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులను పెంచి అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) పల్నాడు జిల్లా సమితి నాయకులు కోరారు. ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరుద్యోగుల అభ్యర్థులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో జాయింట్‌ కలెక్టర్‌ సంజనా శ్రీహర్షకు వినతి పత్రం ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, నిరుద్యోగుల నాయకులు మక్కెన వంశీ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2,050 పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. ఆ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్యకు ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్‌ సంఖ్యకు పొంతన లేకుండా ఉందన్నారు. ఇప్పటికే పోలీసు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి శిక్షణ తీసుకుంటూ ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే విధంగా ప్రకటన ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ రద్దుచేసి తక్షణమే పూర్తిస్థాయి పోస్టుల నియమకాలు చేపట్టేందుకు సమగ్ర నోటిఫికేషన్‌ విడుదల చేసి వేలాదిమంది అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదనపు సిబ్బంది నియమించటం ద్వారా ఇప్పుడు పని చేస్తున్న పోలీస్‌ సిబ్బందిపై పని భారం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ జరుగుతుందన్నారు. జిల్లా నాయకులు రోడ్డ అంజిరెడ్డి, యు.రాజు, నిరుద్యోగ నాయకులు సురేంద్ర పాల్గొన్నారు.

ఇద్దరు మృతి– మరొకరికి తీవ్రగాయాలు

రోడ్డున పడ్డ రెండు కుటుంబాలు

మాచర్ల: పట్టణంలోని శ్రీశైలం రోడ్డులో ఆదివారం అర్థరాత్రి మూల మలుపు వద్ద డివైడర్‌ను ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరొక వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. 9వ వార్డుకు చెందిన శంకర్‌, బాలకృష్ణాచారి, ఉప్పుతోళ్ల గురవయ్యలు వినాయక ఉత్సవాల్లో పాల్గొని తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ద్విచక్ర వాహనాన్ని పక్కకు తిప్పటంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో వాహనంపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకొని వీరిని 108 వాహనంలో మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి తరలించే లోపు శంకర్‌(36) మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తి బాలకృష్ణాచారి(34)ను నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఉప్పుతోళ్ల గురవయ్యను నరసరావుపేటలో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరు ముగ్గురు చక్క పనులు చేస్తుంటారు. మృతులు ఇద్దరికి భార్య, పిల్లలున్నారు. వీరి మృతితో ఆ కుటుంబాలలో విషాదం నెలకొంది.

పిడుగురాళ్ల: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్‌ జబీర్‌ను పిడుగురాళ్ల పట్టణ పోలీసులు సోమవారం రాత్రి అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... పట్టణంలోని పిల్లలగడ్డ ప్రాంతంలో సూఫీ మసీదులో సోమవారం రాత్రి ఈషా నమాజ్‌ చేసుకొని జబీర్‌ అతని సోదరుడు ఖలీల్‌ వస్తుండగా పట్టణ పోలీసులు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి వారి ఇద్దరిని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని జబీర్‌ పోలీసులను ప్రశ్నించినప్పటికి వారు ఏ సమాధానం చెప్పక ద్విచక్ర వాహనంపై పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావును జబీర్‌, ఖలీల్‌లను ఏ కేసులో అరెస్టు చేశారని సాక్షి వివరణ కొరగా పట్టణానికి చెందిన మారుతీ అంజిబాబు సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇరువురిని మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు.

మృతుడు బాలకృష్ణాచారి

మృతుడు శంకరచారి

ఉప్పుతోళ్ల గురవయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement