సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కమిటీ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కమిటీ ఏర్పాటు

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కమిటీ ఏర్పాటు రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి రాజుపాలెం: కారు అతివేగంతో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై కొత్తబోధనం సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద సోమవారం చోటుచేసుకుంది. క్రోసూరు మండలం 88 తాళ్లూరుకు చెందిన మేదర మరియదాసు(32), మేదర ప్రేమ్‌సాగర్‌లు ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల వెళుతున్నారు. పిడుగురాళ్ల నుంచి సత్తెనపల్లి అతి వేగంగా వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ద్విచక్రం వాహనంపై ఉన్న ఇరువురు రోడ్డుపై పడిపోయారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న మేదర మరియదాసు తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ప్రేమసాగర్‌కు తీవ్ర గాయాలు కావడంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మణికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విద్యుదాఘాతానికి ఎలక్ట్రీషియన్‌ మృతి కారెంపూడి: విద్యుదాఘాతానికి గురై ప్రైవేటు ఎలక్ట్రికల్‌ వర్కర్‌ మృతి చెందన ఘటన మండలంలోని చింతపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చింతపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన లంక శేషయ్య ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. విద్యుత్తు శాఖ పనులకు వెళ్లడంతోపాటు తాను సొంతంగా పనులు చేస్తుంటాడు. ఈక్రమంలో గ్రామానికి చెందిన రైతు వేముల శ్రీనివాసరావు తన పొలంలో సర్వీస్‌ వైరు మార్చేందుకు శేషయ్యను తీసుకెళ్లాడు. సర్వీస్‌ వైరును మార్చే క్రమంలో ఆయన విద్యుత్తు షాక్‌కు గురయ్యాడని తెలుస్తోంది. అతను నిల్చున్న ప్రాంతంలో నీరు ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువై శేషయ్య (41) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై మృతుడి భార్య సత్యవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ ఎం వాసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శేషయ్యకు భార్య సత్యవతి, ముగ్గురు పిల్లలున్నారు. శేషయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు రోధిస్తున్నారు.

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్‌ 15వ తేదీన నిర్వహించనున్న 2వ రాష్ట్రస్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణకు నూతన నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసినట్టు బాలోత్సవ్‌ కమిటీ అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌, కట్టా కోటేశ్వరరావు సోమవారం తెలిపారు. గత ఏడాది నిర్వహించిన ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసారని తెలిపారు. గత ఏడాది కంటే మరింత ఘనంగా నిర్వహించేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా కపలవాయి విజయకుమార్‌, అధ్యక్షుడిగా టి.అంజిరెడ్డి, కార్యదర్శిగా షేక్‌ మహమ్మద్‌ గౌస్‌, కోశాధికారిగా మద్దుకూరి మోహనరావు ఎంపికయ్యారు. వేడుకలను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు, సాహిత్య, సాంస్కృతికాభిమానులు సహరించాలని కోరారు.

–మరో యువకుడికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement