పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదుల వెల్లువ

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

జిల్లా పోలీసు కార్యాలయంలో

పీజీఆర్‌ఎస్‌

ఫిర్యాదులు స్వీకరించిన అదనపు

ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి

అదనపు ఎస్పీ దృష్టికి 116 ఫిర్యాదులు

నరసరావుపేట రూరల్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై 116 ఫిర్యాదులు అధికారులు అందాయి. జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన మహిళలు, వృద్దులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో విచారణ వేగవంతం చేసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని అదనపు ఎస్పీ సూచించారు.

అకారణంగా దాడి చేసి హత్యకు

ప్రయత్నించారు

నలుగురు యువకులు నాపై దాడి చేసి రైలు పట్టాలపై పడేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని నరసరావుపేటలోని వరవకట్టకు చెందిన షేక్‌ జిలాని ఫిర్యాదు చేశాడు. ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద నిలిచి ఉండగా షారూక్‌, షేక్‌ సుభాని, చిట్టినాయుడుతోపాటు మరొకరు తనపై దాడి చేశారని తెలిపాడు. సమీపంలోని రైలు పట్టాలపై పడేసి బెదిరింపులకు పాల్పడ్డారని వివరించాడు. ఆ సమయంలో నజీర్‌ అనే వ్యక్తి గమనించి రైలు కింద పడకుండా రక్షించినట్టు తెలిపాడు. అనంతరం ఇంటి వద్దకు వచ్చి కర్రలతో తలుపులు కొట్టి భయాందోళనకు గురిచినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వివరించాడు.

తల్లి, కుమార్తె కనిపించడం లేదు

పుట్టింటికి వెళ్లిన తల్లి, కుమార్తె కనిపించడం లేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మహిళ తండ్రి అచ్చంపేట మండలం రుద్రవరానికి చెందిన గంటా వెంకటేశ్వర్లు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల నుంచి మూడు నెలల కిందట నాదెండ్ల గంగాభవాని తనకుమార్తె పూజితలు తమ ఇంటికి వచ్చారని తెలిపాడు. అక్కడ నుంచి ఇరువురు కనిపించకుండా పోయారని దీనిపై పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వివరించాడు.

సోదరుడే బంగారం, నగదు అపహరించాడు

పుట్టుక నుంచే అంగవైకల్యంతో బాధపడుతున్న తన పోషణ నిమిత్తం తల్లి ఇచ్చిన ఆస్తి కోసం వరసకు సోదరుడు అయ్యే వ్యక్తి బెదిరింపులకు పాల్పడటంతోపాటు ఎవరూ లేని సమయంలో ఇంటిలోకి ప్రవేశించి బంగారం, నగదు అపహరించాడని సత్తెనపల్లికి చెందిన దామెర్ల శ్రీదేవి ఫిర్యాదు చేసింది. తన పోషణ కోసం 176 గజాల స్థలం, 40 సవర్ల బంగారం, రూ.2లక్షలు నగదు తల్లి ఇచ్చిందని వివరించింది. ఎవరైతే పోషణ సక్రమంగా చూస్తారో వారికి ఇవ్వమని తల్లి తెలిపినట్టు ఫిర్యాదులో పేర్కొంది. వరసకు సోదరుడు అయ్యే అంకాళ్ల శ్రీనివాసులు ఇంటికి వచ్చి పెత్తనం చే యాలని చూడటంతో పాటు నా తండ్రిపై దుర్భాషలాడే వాడని తెలిపింది. గత నెల 20వ తేదీ న తండ్రితో కలిసి గిద్దలూరు వెళ్లినట్టు అప్పుడు శ్రీనివాసులు ఇంటిలోకి ప్రవేశించి బంగారం, నగదు అపహరించాడని వివరించింది. దీనిపై సత్తెనపల్లి పోలీసులుకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలిపింది.

కోడలు, మనవడు నుంచి ప్రాణహని

ఆస్తి కోసం మనవడు, కోడలు కలిసి దాడికి పాల్పడ్డారని చిలకలూరిపేట మండలం మురికిపూడికి చెందిన వనపర్తి కోటేశ్వరరావు ఫిర్యాదు చేసాడు. తనకు కుమారుడు, కుమార్తె ఉన్నారని తెలిపాడు. కుమారుడికి తన ఇంటి పక్కనే ఇంటిని ఇచ్చినట్టు పేర్కొన్నాడు. అయితే తాము ఉంటున్న ఇళ్లు కూడా కావాలని మనవడు భాను, కోడలు పద్మలు కలిసి తమపై దాడికి పాల్పడ్డారని తెలిపింది. తమ తదనంతరం ఇస్తామని చెప్పినా వినకుండా వెదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement