డీఎస్సీ అక్రమాలపై పోరులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై పోరులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

డీఎస్సీ అక్రమాలపై పోరులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు జిల్లా టెన్నికాయిట్‌ బాలబాలికల జట్ల ఎంపిక నరసరావుపేట రూరల్‌: జిల్లా టెన్నికాయిట్‌ బాల,బాలికల జట్ల ఎంపిక పోటీలు సోమవారం లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించారు. జిల్లా టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలలో ప్రతిభ కనబర్చిన బాల, బాలికలను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. వీరు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి జూనియర్‌ టెన్నికాయిట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలలో పాల్గొంటారని అసోసియేషన్‌ జిల్లా సెక్రటరీ జీవనజ్యోతి తెలిపారు. బాలుర విభాగంలో ఆర్‌.శ్రీగణేష్‌, వి.వీరతేజేశ్వర్‌, జి.రిషి(జిల్లా ఉన్నత పాఠశాల, ఎస్‌బీపురం), డి.కోటేశ్వరరావు, పఠాన్‌ షాహీనా (జెడ్పీ హైస్కూల్‌, నకరికల్లు), బాలికల విభాగంలో వై.హరిక, సీహెచ్‌ సౌమిక, వై.ఎస్తేర్‌ రాణి (కేజీబీవీ, నాదెండ్ల)లు ఎంపికయ్యారు. న్యాయనిర్ణేతలుగా వ్యాయామ ఉపాధ్యాయులు సిహెచ్‌ పుల్లయ్య, పి.తిరుపతిరావు, జి.ఝాన్సీరాణి, ఎన్‌.రాణి, అంజి, శ్రీలక్ష్మి వ్యవహరించారు. సీనియర్స్‌ విభాగంలో పోటీలకు క్రీడాకారులు హాజరుకాకపోవడంతో జిల్లా జట్టును ఎంపిక చేయలేదు. వీఆర్‌కు సబ్‌జైలు కానిస్టేబుల్‌ అపరాధ రుసుం వసూళ్లకు చర్యలు

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

పిడుగురాళ్ల: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ అక్రమాలపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. గురజాల నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసేందుకు సోమవారం వెళ్లారు. మహేష్‌రెడ్డి మాట్లాడుతూ నీట్‌ పరీక్షకు సంబంధించి పేపర్‌ లీక్‌ అయితే కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీలో భారీ అవతవకల వలన రాష్ట్ర విద్యా శాఖమంత్రి రాజీనామా చేయాలా వద్ద దానిపై ప్రజల పక్షాన నిలబడి నిరసన తెలియజేస్తుంటే వైఎస్సార్‌ సీపీ శాప్‌ కార్యాలయం ఎదుట ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలియజేసేవారిపై తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేయటం, పోలీసుల చేత వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా నిర్బందించటాన్ని నిరసనగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసన తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఎందుకు అవకతవకలు జరిగాయని ప్రతి ఒక్కరు నినదిస్తుంటే మంత్రి లోకేష్‌ బయటకు వచ్చి ఎక్కడా అవకతవకలు జరగలేదని, ఇదు గో సాక్ష్యాలు అని నిరూపించలేకపోతున్నా రని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కేసు నమోదు చేసిన వినుకొండ పోలీసులు..

వినుకొండ: ఆర్థిక లావాదేవీల వివాదంలో మద్యం దుకాణ యజమాని కుమారుడితో ఘర్షణకు దిగిన సబ్‌జైలు కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు శాఖాపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. వినుకొండ సబ్‌జైలులో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ తిరుమలరావు మూడేళ్ల కిందట పరిచయస్తుడైన ఓ బార్‌ అండ్‌ వైన్‌ షాప్‌ యజమాని నారాయణ కుమారుడికి లక్షల రూపాయల మధ్యవర్తిగా ఉండి ఇప్పించాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించకుండా జాప్యం చేయడంతో తిరుమలరావు మద్యం దుకాణానికి వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాదులాట జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో మద్యం దుకాణం యజమానికి ముక్కు వెంట రక్తం రావడంతో ఇద్దరూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్‌ తిరుమలరావుపై దాడి, దౌర్జన్యం కింద కేసు నమోదు చేసి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయనను వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్‌)కు పంపారు. మద్యం షాప్‌ యజమానిపై నామమాత్రపు కేసు నమోదు చేశారు. బకాయిలు ఎగ్గొట్టేందుకే మద్యం సీసాలు అడిగితే ఇవ్వలేదని దౌర్జన్యం చేశారని సృష్టించి తనపై తప్పుడు బనాయించారని కానిస్టేబుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్‌ శాఖ విజిలెన్స్‌

ఎస్‌ఈ కేవీఎల్‌ఎన్‌ మూర్తి

ఈపూరు: విద్యుత్‌ చౌర్యం పాల్పడుతున్న వారిని నుంచి అపరాధ రుసుం వసూళ్లకు చర్యలు చేపట్టినట్లు విజిలెన్స్‌ ఎస్‌ఈ కెవీఎల్‌ఎన్‌ మూర్తి అన్నారు. స్థానిక ఈపూరు విద్యుత్‌ ఉపకేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ 2015–2026 మధ్యకాలంలో ఈపూరు మండలంలో విద్యుత్‌ చౌర్యానికి సంబంధించి 1300 కేసులు నమోదయ్యాయన్నారు. సుమారు రూ.15 లక్షలు అపరాధ రుసుం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని నెలాఖరుకు వసూలు చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. విజిలెన్స్‌ ఏడీఈ రవికుమార్‌, నరసరావుపేట రూరల్‌ ఏడీఈ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement