నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య కార్యవర్గ అధ్యక్షునిగా కాశీనాథుని సుబ్రహ్మణ్యశర్మ, కార్యదర్శిగా పాలపర్తి సుధీర్‌కుమార్‌శర్మ (నరసరావుపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాష్‌నగర్‌లోని శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు ఎన్నికల పరిశీలకుడు సమాఖ్య రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గాలి శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారి బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి కె.వి.పురుషోత్తమరావు సోమవారం తెలిపారు. సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులుగా కోనంకి పవన్‌కుమార్ (చిలకలూరిపేట), కౌశిక వెంకట నాగమల్లేశ్వరప్రసాద్ (అమరావతి), సహాయ కార్యదర్శిగా మారేపల్లి లక్ష్మీనారాయణ (మాచర్ల), సంయుక్త కార్యదర్శిగా తంగెడ ప్రసాద్ (గురజాల) ఎన్నికయ్యారు. సమాఖ్య సలహా మండలి చైర్మన్‌గా ముత్తనపల్లి శివకృష్ణప్రసాద్, వైస్ చైర్మన్‌లుగా దండంరాజు హనుమంతరావు, పోలూరి చంద్రమౌళి, మంత్రిరాజు సత్యనారాయణ, వేదాంతం హరనాథ్, మద్దాలి రాంబాబు, దివాకరుని రాధాకృష్ణమూర్తి ఎన్నికయ్యారు. అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ జిల్లాలో బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ఇరుముడి చిత్రంలో అందాల పల్లకీ.. పాట ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన గాయకుడు గుంటూరు శ్రీనివాస్ (డప్పు శ్రీను)ను సత్కరించారు.
అధ్యక్ష్య, కార్యదర్శులుగా
సుబ్రహ్మాణ్యశర్మ, సుధీర్‌కుమార్‌శర్మ


