గణపతిని కొట్టింది ముమ్మాటికీ పోలీసులే | - | Sakshi
Sakshi News home page

గణపతిని కొట్టింది ముమ్మాటికీ పోలీసులే

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

● పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్‌.ప్రసాదు మాట్లాడుతూ పోలీసుల మొరాలిటీ దెబ్బతీసే విధంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా వ్యవహరిస్తున్నాడంటూ డీఎస్పీ మాట్లాడటంలో ఏమాత్రం నిజంలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుస్టేషన్లు అన్నీ టీడీపీ కార్యాలయాలుగా మార్చి తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. మంచి పనులు చేస్తే పోలీసుల విలువ పెరుగుతుందే కాని టీడీపీ వారు చెప్పిన విధంగా నడుచుకుంటే పెరగదనే విషయం డీఎస్పీ గమనించాలని అన్నారు.

ఫేక్‌ వీడియోలతో పోలీసులు మోసగిస్తున్నారు ప్రభుత్వాసుపత్రిలో రికార్డు చేసిన స్టేట్‌మెంట్‌ ప్రకారం కేసు ఫైల్‌ చేయాలి లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు

ఫేక్‌ వీడియోలతో నమ్మించే యత్నం

నరసరావుపేట: వినుకొండ నియోజకవర్గం ఈపూరుకు చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త గణపతిని ముసుగులు ధరించి అపహరించి దాడిచేసి కొట్టింది ముమ్మాటికీ పోలీసులేనని వైఎస్సార్‌ సీపీ నరసరావుపేట, వినుకొండ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడులు స్పష్టం చేశారు. స్థానిక నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ ఈపూరు మండల కేంద్రంలో గణపతి అనే యువకుడిని పోలీసులు 19వ తేదీ ఉదయం ఎనిమిది గంటల సమయంలో మాస్కులు ధరించిన పోలీసులు కారులో వచ్చి బలవంతంగా తీసుకువెళ్లి కొట్టి, భయపెట్టి నరసరావుపేట ఎన్‌ఈసీ కళాశాల వద్ద వదిలిపెట్టారన్నారు. గాయాలతో ఏరియా హాస్పిటల్‌లో గణపతి చికిత్స పొందుతూ తనను కొట్టింది పోలీసులేనని నరసరావుపేట రూరల్‌ పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడన్నారు.

టీడీపీ నేతల్లా పోలీసుల తీరు..

వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ నియోజకవర్గంలో పోలీసులు శాంతిభద్రతలను పక్కనపెట్టి టీడీపీ నాయకుల్లా వ్యవహరించటం చాలా బాధగా ఉందన్నారు. గణపతిని కొట్టడం అనేది కొత్తకాదని, వెంకటరావు అనే సోషల్‌మీడియా కార్యకర్తను ఐదు మండలాలు తిప్పి కొట్టారన్నారు. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్న వారందరిని కొట్టి కేసులు పెట్టారన్నారు. డీఎస్పీ ఆరోపించినట్లుగా తమకు సీఐ, ఎస్‌ఐలపై ఏమాత్రం కక్షలేదన్నారు. పిడుగురాళ్ల గణపతి వెళ్లినట్లుగా ఫేక్‌ వీడియాలు రిలీజ్‌ చేశారే కాని, అతను ఎక్కడికి వెళ్లాడనే విషయం చెప్పలేదన్నారు. బస్టాండ్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయి గణపతిని పలుకరిస్తే పలుకకుండా పోయాడని చెబుతున్నారని, వారు చెప్పిన ఆ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయి కూడా టీడీపీ కార్యకర్తేనన్నారు.

డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ.. డీఎస్పీ హనుమంతరావు సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించి గణపతిని తాము తీసుకెళ్లలేదని, అతను ఎవరో తమకు తెలియదని చెప్పారన్నారు. పిడుగురాళ్ల బస్టాండ్‌లో బస్సు ఎక్కుతూ కనపడ్డాడని అంటూ ఒక ఫేక్‌ వీడియో రిలీజ్‌ చేశారన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి జరిగింది 19వ తేదీ అయితే 21న వీడియో రిలీజ్‌ చేశారన్నారు. పోలీసులు రిలీజ్‌ చేసిన వీడియోలో ఆ వ్యక్తి ముఖం కన్పించకుండా ఒక వ్యక్తికి గళ్లచొక్క, లుంగీ తొడిగి వీడియో తీశారని, మొహమే కనపడకపోతే పోలీసులు అతనే గణపతి అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. వీడియోని మాడిఫై చేసి పెట్టారని, ఒక డీఎస్పీ స్థాయి అధికారి ఫేక్‌ వీడియో రిలీజ్‌ చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయటం విచారకరమన్నారు. ఒక వీడియో ఉదయం 8:45 రికార్డు చేశారని, మరొకటి వీడియో పట్టపగలు రికార్డ్‌ చేసి రాత్రి 9.22 రికార్డు చేసినట్టు చూపిస్తున్నారన్నారు. గణపతి ఒక సామాన్య యువకుడని, నిజంగా తనను పోలీసులే కొట్టకపోతే ఒక ఎస్‌ఐ, సీఐ మీద నన్ను కొట్టారని చెప్పే ధైర్యం ఉంటుందా అని ప్రశ్నించారు. గణపతి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రకారం కేసు ఫైల్‌ చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నిందితులు పోలీసులు కాబట్టి కేస్‌ ఫైల్‌ చేయకుండా ఫేక్‌ వీడియోలు సృష్టించి ప్రజల్ని మోసం చేసేందుకు పన్నాగం పన్నారన్నారు. వారు ఫేక్‌ వీడియోలు తయారుచేసి తాము పోలీసులను డీమోరలైజ్‌ చేస్తున్నామని అంటున్నానడం విడ్డూరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement