అమరావతి: మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయలు, ప్రధానోపాధ్యాయులు ఇటీవల ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న నలుగురిని మంగళవారం సన్మానించారు. స్థానిక మండల పరిషత్ సమావేఽశమందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న గీతాయామిని, చంద్రలీల, అపర్ణ, శోభారాణిని మండల విద్యాశాఖాధికారులు ప్రసాద్, శివబాబు, ఉపాధ్యాయులు సన్మానించారు.
ది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ
యడ్లపాడు: గ్రామీణ వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 25న రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లు ది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గల్లా మురళీకృష్ణ తెలిపారు. యడ్లపాడు గ్రామంలో మంగళవారం సంఘం నాయకులు మాట్లాడుతూ..గ్రామీణ వైద్యుల వృత్తి పరిరక్షణ, ప్రభుత్వ గుర్తింపుతో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోసం అనేక సంఘాలు సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నాయని తెలిపారు. తమ హక్కుల సాధన కోసం ఆయా సంఘాలన్నీ ఏకతాటిపై వచ్చి రాష్ట్ర మహాసభకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ వైద్యులు, ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒంగోలు త్రోవగుంట బృందావన్ గార్డెన్స్‌లో వేదికగా ఈ మహాసభ కొనసాగుతుందన్నారు. ఈ మహాసభకు గ్రామీణ వైద్యులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ వైద్యుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ప్రాథమిక వైద్య సంఘాల సమాఖ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యామర్తి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరెళ్ల గణపతిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘం సభ్యులు ఖలీఫాతుల్లా, ఎస్ మారుతీకృష్ణ, కె శ్రీనివాసరావు, ఎం సుదర్శనరావు, కె రామకృష్ణ, జి సుధాకర్, షేక్ జాన్‌సైదా, జి గోపి, ఎస్ రాజేశ్వరి, షేక్ మీనుసుల్తాన తదితరులు ఉన్నారు.
యడ్లపాడు: వినాయక చవితి వేడుకల్లో జరిగిన ఘర్షణలో ఇరువురికి గాయాలయ్యాయి. మండలంలోని లింగారావుపాలెంలో యాదవ సామాజిక ఆధ్వర్యాన వినాయక చవితి పందిరి ఏర్పాటుచేశారు. సోమవారం అందరూ కలిసి సంతోషంగా నిమజ్జన వేడుకలు నిర్వహించారు. తిరిగి వస్తున్న క్రమంలో మద్యం మత్తులో ఇరువురి మధ్య వాగ్వాదంగా ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇద్దరికి గాయాలవ్వడంతో వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


