సమస్యల పరిష్కారం కోసం ఆశాడే బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారం కోసం ఆశాడే బహిష్కరణ

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

సమస్యల పరిష్కారం కోసం ఆశాడే బహిష్కరణ

డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేత

నరసరావుపేట: సమస్యలు పరిష్కారం కోసం యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వచ్చే నెల 6వ తేదీన నిర్వహించనున్న ఆశా డే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియనన్‌ (సీఐటీయూ) పల్నాడు జిల్లా కమిటీ నాయకులు ప్రకటించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు డి.శివకుమారి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను సచివాలయాల్లో పని దినాల్లో కూర్చోబెట్టడం వల్ల క్షేత్రస్థాయి సేవలకు ఆటంకం కలుగుతుందని, లెప్రసీ సర్వేను ఆశా కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో నిర్వహించి నోట్‌బుక్‌లో వివరాలను నమోదు చేస్తున్నారని, వాటిని తిరిగి ఆన్‌న్‌లైనన్‌ యాప్‌లో నమోదు చేయాలని ఒత్తిడి చేయడం వల్ల పనిభారం పెరుగుతుందన్నారు. భౌతికంగా రికార్డులు రాయడంతో పాటు యాప్‌లోనూ వివరాలు నమోదు చేయాలనే నిబంధనలను మినహాయించాలని కోరారు. ఇప్పటికే ఆశా యాప్‌లో అవసరమైన సమాచారాన్ని నమోదు చేస్తున్నామని తెలిపారు. ఆశా కార్యకర్తలు ఒకటి, రెండు రోజులు కుటుంబ అవసరాల కోసం సెలవు తీసుకోవాలన్నా ఇతర ఆశా కార్యకర్తకు బాధ్యతలు అప్పగించి, వారి సంతకం తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఏఎన్‌న్‌ఎం నుంచి వైద్యాధికారి వరకు అనుమతులు తీసుకోవాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఏఎన్‌ఎంలకే సెలవులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లెప్రసీ సర్వేలో పని చేసిన మేల్‌ వర్కర్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఆశావర్కర్లకు సంబంధించిన పెండింగ్‌ సమస్యలను పరిష్కరించడంతో పాటు, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు ఆశా డే కార్యక్రమానికి దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆశా వర్కర్లు కోరారు. ప్రధాన కార్యదర్శి ఎం.రత్నకుమారి జిల్లా కోశాధికారి ఎం.ధనలక్ష్మి షేక్‌.జరీనా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement