15 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీలో అడ్మిషన్‌లు పిడుగురాళ్ల: డ్రాప్ అవుట్ విద్యార్థులు, ఆర్థిక భారంతో చదువు మానివేసిన బాలబాలికలు, గృహణిలు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వా రు ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్ పొందటానికి సెప్టెంబర్ 15వ తేదీ తుది గడువు అని ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కో ఆర్డినేర్ బొనిగల హైమారావు తెలిపారు. పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఎంఈవో ఎండీ ఖాశీం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రాథమిక, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ సూపర్ వైజర్లు, ఆశా వర్కర్లకు మండలస్థాయి ఒక రోజు ఒరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈవో ఎండీ ఖాశీం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, దివ్యాంగులకు ఫీజు రాయితీ, అతి తక్కువ ఫీజులతో 10వ తరగతి ఐదు పేపర్లతో పాసై, ఇంటర్ మీడియట్, ఐటీఐ, పాలిటెక్నికల్ వంటి పలు కోర్సులు చేరేందుకు అవకాశం ఉందన్నారు. ఇంటర్ పాసైన వారు ఎంసెట్ రాసి ఇంజినీరింగ్‌లో కూడా చేరవచ్చని తెలిపారు. అనంతరం ఓపెన్ స్కూల్ 2026–27 విద్యా సంవత్సరం అడ్మిషన్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల హెచ్‌ఎంలు పాల్గొన్నారు. బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం వినుకొండ: పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కోచింగ్ క్యాంపు గురువారం ప్రారంభమైంది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు 8 రోజులపాటు ఈ శిక్షణ శిబిరం కొనసాగనుంది. అనంతరం ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టు ఈ నెల 11, 12, 13 తేదీల్లో మార్కాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీ చైర్మన్, గంగినేని ఫౌండేషన్ అధ్యక్షుడు గంగినేని రాఘవరావు రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల ద్వారా ఎంతో మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై.రమేష్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు రోశయ్య, తెదేపా నాయకులు బత్తుల గోవిందయ్య, ఏడుకొండలు, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీనివాసరావు, అధ్యక్షుడు ఈ.శివశంకర్, ఏటీపీ ప్రశాంతి, కోచ్ జోనా నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిచ్చి కుక్క స్వైర విహారం భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు మూడేళ్లు జైలు
11మందికి తీవ్ర గాయాలు
అచ్చంపేట: పిచ్చికుక్క స్వైర విహారం చేసి 11 మందిని తీవ్రంగా గాయపరచిన ఘటన అచ్చంపేట మండలం మాదిపాడులో గురువారం చోటుచేసుకుంది. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో షేక్ సైదా, ఫాస్టర్ విద్యాశేఖర్, యాంపొంగు శ్రావణి, మరికొంతమంది పడవ ప్రయాణికులు ఉన్నారు. అందరికి డాగ్‌బైట్ ఇంజక్షన్లు చేశారు. గాయపడినవారిలో ఒక చిన్నారి కూడా ఉన్నాడు. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం లేదని, అందరికి ఇంజక్షన్లు చేశామని వైద్యాధికారి రాములునాయక్ తెలిపారు.
సత్తెనపల్లి: భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు మూడు సంవత్సరాల కారాగార శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి విజయ్‌కుమార్‌రెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. అమరావతికి చెందిన ఒంటిపులి దావీదు, నాగలక్ష్మి భార్యా,భర్తలు. 17 సంవత్సరాల కిందట వీరికి వివాహమైంది. కొంతకాలంగా చెడు అలవాట్లకు బానిసైన భర్త భార్యను మానసికంగా, శారీరకంగా హింసిస్తుండడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వాత సరిగ్గా చూసుకుంటానని నమ్మబలికి 2019 అక్టోబర్ 21న దావీదు తన భార్యను అమరావతి తీసుకొని వచ్చాడు. ఇంటికి రాగానే నిన్ను చంపడానికే ఇంటికి పిలిచానని, కూరగాయల కత్తితో ఆమె పీక కోసి కొన్నిచోట్ల గాయపరిచి పడవేసి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వారి సహాయంతో 108 అంబులెన్స్‌లో అమరావతి సీహెచ్‌సీలో చేరి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ తరలించారు. వైద్యశాలలో బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్ మేరకు భర్త దావీదుపై అప్పటి అమరావతి ఎస్‌ఐ డి రవీంద్రబాబు కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొల్లా వెంకటేశ్వరరావు కేసుకు సంబంధించిన న్యాయ పరమైన విషయాలను వివరిస్తూ కేసు నిరూపణ అవడంలో కీలకపాత్ర పోషించాడు. న్యాయమూర్తి విజయ్‌కుమార్‌రెడ్డి పై విధంగా తీర్పు వెలువరించారు.