బెయిల్‌పై సింగారెడ్డి విడుదల | - | Sakshi
Sakshi News home page

బెయిల్‌పై సింగారెడ్డి విడుదల

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

మాజీ మంత్రి విడదల రజిని పరామర్శ

నాదెండ్ల: అక్రమ కేసుల్లో అరైస్టె జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు, మార్కెట్‌యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌ సింగారెడ్డి కోటిరెడ్డి గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం మాజీ మంత్రి విడదల రజిని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ ముప్‌పై ఏళ్ల తన రాజకీయ జీవితంలో కక్షసాధింపు రాజకీయాలు తానెప్పుడూ చూడలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒకసారి అరెస్టు చేశారని, ప్రస్తుత టీడీపీ పాలనలో నాతో పాటూ మాజీ సర్పంచ్‌, నా భార్య లక్ష్మిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, వైఎస్సార్‌ సీపీ కోసం తానెప్పుడూ పనిచేస్తానని స్పష్టం చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాజకీయ వేధింపులతో నాయకులు, కార్యకర్తల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. కష్టకాలంలో పార్టీ శ్రేణులకు అండగా నిలవటం తన బాధ్యత అని, చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యంగా సాగాలన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఉడతా వెంకటేశ్వరరావు, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు గుంజి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు దరియావలి, నాదెండ్ల మండల ఉపాధ్యక్షుడు అల్లడి రవికుమార్‌, ఎస్సీ సెల్‌ నాయకులు శేషయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్‌, బూత్‌ కమిటీ అధ్యక్షుడు శేషిరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement