రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా యశోదర చెన్నారెడ్డి హత్యకేసులో నిందితుని లొంగుబాటు రెంటచింతల: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించిన వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నవులూరి చెన్నారెడ్డి హత్య కేసులో ఒకరు గురజాల కోర్టులో లొంగిపోగా, మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున గురువారం తెలిపారు. ఆగస్టు 6వ తేదీ రాత్రి జరిగిన చెన్నారెడ్డి హత్య కేసులో నిందితుడు మోర్తల ఉమా మహేశ్వరరెడ్డి గురజాల కోర్టులో లొంగిపోగా అతనికి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. మరొకరు జక్కిరెడ్డి లచ్చిరెడ్డి గురజాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో నిదితులైన జక్కిరెడ్డి జోగిరెడ్డి, నవులూరి అశోక్‌రెడ్డి, మద్దిగపు పేర్రెడ్డి, జక్కిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, జక్కిరెడ్డి కోటిరెడ్డి, నవులూరి పిచ్చిరెడ్డి, పేరం పెద్ద సీతారెడ్డి, పేరం చిన్న సీతారెడ్డిలను అరెస్ట్ చేయగా వారికి కూడా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వైద్య కళాశాలలో చేరిన విద్యార్థులు గుంటూరు మెడికల్: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన పలువురు వైద్య విద్యార్థులు గురువారం గుంటూరు వైద్య కళాశాలలో చేరారు. కన్వీనర్ కోటాలో తొలిరోజు ప్రవేశాలు ప్రారంభం అవడంతో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీధర్ సీట్లు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించి అడ్మిషన్ కార్డులు అందజేశారు. ఈనెల 7 వరకు వైద్య విద్యార్థులు కళాశాలలో చేరేందుకు హెల్త్ యూనివర్సిటీ వారు అవకాశం ఇచ్చారు. గుంటూరు వైద్య కళాశాలలో 250 ఎంబీబీఎస్ సీట్లకు గాను 37 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఆల్ ఇండియా కోటాలో సీట్లను ఫ్రీజ్ చేసుకున్నారు. రాష్ట్ర కన్వీనర్ కోటాలో 201 మంది గుంటూరు వైద్య కళాశాలను ఎంపిక చేసుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ గుంటూరు వైద్య కళాశాలకు 80ఏళ్ల వైద్య చరిత్ర ఉందన్నారు. వైద్య కళాశాలలో వైద్యవిద్యనభ్యసించి విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో పేరుగాంచిన వైద్యులుగా పలువురు రాణిస్తున్నట్లు వెల్లడించారు. అంతటి ఘన చరిత్ర కలిగిన గుంటూరు వైద్య కళాశాలలో నూతనంగా చేరుతున్న వైద్య విద్యార్థులంతా క్రమశిక్షణతో వైద్యవిద్యనభ్యసించి చదువుతున్న మాతృ సంస్థకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ ఎం.అమృత, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వినుకొండ: వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ వింజనంపాటి యశోదర ప్రతిష్టాత్మక రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యా రంగంలో ఆమె అందిస్తున్న విశేష సేవలు, సాధించిన ఘనతలకు గాను ఈ గౌరవం దక్కింది. డాక్టర్ యశోదర 1995 జూన్‌లో బాపట్ల ఎస్.ఎమ్. గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్‌లో హిందీ గ్రేడ్–2 ఉపాధ్యాయురాలిగా తమ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2000 మే నెలలో సంగం జాగర్లమూడి జెడ్పీ ఉన్నత పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. 2025 జూన్‌లో వినుకొండ బాలుర ఉన్నత పాఠశాల హెచ్.ఎమ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె, ప్రస్తుతం రొంపిచర్ల మండలం ఎఫ్‌ఏసీ ఎంఈఓగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పరిశోధనలు, పుస్తక రచనల్లో ప్రతిభ
2017లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా ‘రామదర్శ మిశ్ర కే కథా సాహిత్య మే నారి‘ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి పీహెచ్‌డీ సాధించారు. 2021లో 7వ తరగతి హిందీ పాఠ్యపుస్తక రచయితగా వ్యవహరించారు. నేషనల్ బుక్స్ ట్రస్ట్ తరఫున హిందీ నుండి తెలుగులోకి ‘బిస్మిల్లా ఖాన్’, ‘ఏకతా కాసిని’, ‘కరోనా వైరస్ – సింబా’ అనే మూడు ప్రతిష్టాత్మక పుస్తకాలను అనువదించారు. నాలుగు సంవత్సరాలుగా యూటీఎఫ్ తరఫున పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్లు తయారు చేయడంతో పాటు, అనేక జాతీయ రీసెర్చ్ జర్నల్స్‌లో వ్యాసాలు ప్రచురించారు.
పాఠశాల పురోగతిలో కీలక పాత్ర
హెచ్.ఎమ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 15శాతం పెరిగింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 14 మందికి పైగా విద్యార్థులు 500 కి పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని సమున్నతంగా నిలిపారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న డాక్టర్ యశోదరను వినుకొండ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు.
మరొకరు అరెస్ట్