న్యూస్‌రీల్
టీడీపీని వీడిన బీసీ విభాగం ముఖ్యనేత
పల్నాట వైఎస్సార్ సీపీలో జోరందుకున్న చేరికలు
టీడీపీ నుంచి వరుసకట్టిన నేతలు
పిన్నెల్లి సమక్షంలో పార్టీలో చేరిన కౌన్సిలర్, మైనార్టీ నేతలు
కాసు మహేశ్‌రెడ్డి సమక్షంలో పార్టీలోకి వచ్చిన దాచేపల్లి బీసీ నేత
వైఎస్సార్ సీపీ కండువా కప్పుకొన్న సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల ముస్లిం నేతలు
టీడీపీ నేతల చేరికలతో
వైఎస్సార్ సీపీలో నూతనోత్సాహం
ప్రభుత్వ వ్యతిరేకత పెరగడమే కారణమని నిట్టూరుస్తున్న టీడీపీ నేతలు
శుక్రవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
కృష్ణం వందే జగద్గురుం
సాక్షి, నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత కొన్ని రోజులుగా పల్నాడు జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు అధికారపార్టీని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది. ఇంకో రెండున్నర సంవత్సరాలు అధికారం చెలాయిస్తామన్న ధీమా కన్నా భవిష్యత్‌పైనే వారికి భయం పట్టుకున్నట్లుంది. దానికి ప్రధాన కారణం గత వారంలో రోజులుగా వైఎస్సార్ సీపీలోకి తెలుగుదేశం పార్టీలో నుంచి వస్తున్న వలసలు. అధికారపార్టీని వదలి, వారు పెడుతున్న భయాలు, ప్రలోభాలకు గురికాకుండా వైఎస్సార్ సీపీ కండువాలు కప్పుకుంటున్నారు. మాచర్ల, గురజాల, సత్తెనపల్లి వంటి నియోజకవర్గాల్లో నిత్యం ఏదో ఒక చోట ప్రజాప్రతినిధులు, బలమైన సామాజికవర్గం అండ ఉన్న నేతలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని ముందుకు వస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవహిస్తుండగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే ఊపు కొనసాగి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపు మరింత మంది నేతలు అఽధికారపార్టీను వీడేందుకు సిద్ధపడుతున్నారని సమాచారం.
వైఎస్సార్‌సీపీలోకి క్యూ కడుతున్న నేతలు
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత...
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ సీపీలోకి వస్తున్న వలసలు పార్టీలో కొత్త జోష్‌ను నింపుతున్నాయి. ఈ ఉత్సాహంతో ఉన్న వైఎస్సార్ సీపీ నేతలు గత ప్రభుత్వంలో చేసిన మంచిని చెప్పుకొంటూనే, కూటమి ప్రభుత్వంలో రెండేళ్లుగా పడుతున్న ఇబ్బందులను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అఽధికార టీడీపీ నేతల్లో ఆంతర్మథనం మొదలైంది. ఎందుకు వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారన్న చర్చ గట్టిగా నడుస్తోంది. ఓ వైపు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే ఇలా నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతుంటే ఎలా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఇవ్వగలమన్న భయం వారిలో నెలకొంది. ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి వెళ్లడానికి అధికారపార్టీ నేతలు అలోచిస్తున్నారు. జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ సైతం జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సక్రమంగా జరగడం లేదని కార్యకర్తల సమావేశంలో పెదవి విరిచినట్లు సమాచారం.
పీఆర్కేను కలసి వైఎస్సార్‌సీపీ తోనే ఉంటామంటున్న మాచర్ల మాజీ కౌన్సిలర్, టీడీపీ నేత జగన్నాథం శివయ్య, అనుచరులు
గురజాలలో గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత టీడీపీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని బేరీజువేసుకొని చాలా మంది టీడీపీ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డు కౌన్సిలర్ ముశ్యం సీతారామయ్య కుమారుడు, టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ముశ్యం శ్రీనివాసరావు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. మాజీ ఎమ్యెల్యే కాసు మహేష్‌రెడ్డి చేతులు మీదుగా కండువా కప్పుకొన్నారు. గురజాల నియోజకవర్గంలో మరింత మంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ నేతలే చెప్పుకొస్తున్నారు. ఊహించని దెబ్బతో ఖంగుతున్న గురజాల ఎమ్యెల్యే యరపతినేని శ్రీనివాసరావు గత రెండేళ్లుగా టీడీపీలో ఉంటున్న గురజాల నగరపంచాయతీ చైర్మన్ బడే జానీ మెడలో కొత్తగా పచ్చ కండువా కప్పి అభాసుపాలయ్యారు.


