పారదర్శకంగా సర్‌ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా సర్‌ ప్రక్రియ

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

నరసరావుపేట ఈస్ట్‌: జిల్లాలో ఓటర్లు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిబంధన ప్రకారం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ సర్‌ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా అధికారులతో కలసి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ కృతికా శుక్లా జిల్లాలో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియ వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌కు వివరించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దెయ్య, ఆర్డీఓ బాలకృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జనగణన హ్యాండ్‌బుక్‌కు పక్కా సమాచారం ఇవ్వాలి..

నరసరావుపేట ఈస్ట్‌: జిల్లా జనగణన హ్యాండ్‌ బుక్‌ ప్రాంతీయ ప్రణాళిక, సామాజిక, ఆర్థిక విధానాల అమలుకు అత్యంత కీలక పత్రమని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం పల్నాడు జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ తయారీ, సంకలనంపై జిల్లా ఉన్నతస్థాయి సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ.. జిల్లాలోని తహసీల్దార్‌లు, మున్సిపల్‌ కమిషనర్‌లు తమ పరిధిలోని సమాచారాన్ని వ్యక్తిగతంగా ధ్రువీకరించి నిర్దేశించిన గడువులోపు అందచేయాలని ఆదేశించారు.

సీఈఓకు వివరించిన కలెక్టర్‌ కృతికా శుక్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement