అతీభృతి లేదు | - | Sakshi
Sakshi News home page

అతీభృతి లేదు

Aug 18 2026 7:16 AM | Updated on Aug 18 2026 7:16 AM

జాబు లేదు.. భృతి రాదు! కల్లబొల్లి కబుర్లు

యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన చంద్రబాబు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.3 వేలు ఇస్తామని సూపర్‌ సిక్స్‌లో చోటు జిల్లాలో నిరుద్యోగ భృతి అర్హులు సుమారు 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న జిల్లా యువత చేస్తున్న పనులు మానేసి కోచింగ్‌ సెంటర్లలో చేరిక రెండేళ్లయినా జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేయని టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చి నిరుద్యోగులకు అన్యాయం

శాశ్వత ఉద్యోగాలు కల్పించిన వైఎస్‌ జగన్‌

జాబు లేదు.. భృతి రాదు!

‘జాబ్‌ రావాలంటే బాబు రావాలి.. జాబ్‌ వచ్చే వరకు నిరుద్యోగ భృతి’ అంటూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ ఐదేళ్లు ఏం చేశారన్నది అందరికీ తెలిసిందే. మూడేళ్ల వరకు నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదు. నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వారిని మభ్యపెట్టేందుకు 2017–18 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించారు. అయితే ఆ సంవత్సరం కూడా ఒక్కరికీ ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. అప్పటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఎక్కడికక్కడ చంద్రబాబు నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు పల్నాడు జిల్లాలో కనీసం పట్టుమని పదివేల మందికి కూడా భృతి ఇవ్వకుండా మోసం చేశారు. 2014–19 మధ్య మోసం చేసినట్టు మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని యువత ఆందోళన చెందుతోంది.

సాక్షి, నరసరావుపేట: ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తన ప్రభుత్వం ఏర్పాటై మూడో ఏడాది వచ్చినా నిరుద్యోగుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ఆలోగా ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి రూ.3 వేలను విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వ ఆధికారంలోకి రాగానే ఉద్యోగాలు పొందవచ్చని భావించిన యువత పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. చంద్రబాబు మరోసారి యువతను మభ్యపెడుతున్నాడంటూ గగ్గోలు పెడుతున్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతంకం చేసిన చంద్రబాబు దాన్ని ఎలా నిర్వహించారో అందరికి తెలిసిందే. మెగా డీఎస్పీని కాస్తా దగా డీఎస్సీ చేసి అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం చేశారు. మరోవైపు గ్రూప్‌–1, 2, 4 ఉద్యోగాల భర్తీ గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

ఉగాది నాడు ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఆగస్టు 15 నాటికి 25 నోటిఫికేషన్ల ద్వారా 3,797 ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన వెలువడాలి. కానీ వాటి ఊసే ఎత్తడంలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

7 లక్షల కుటుంబాలు ఎదురు చూపులు

చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమ బిడ్డలకు ఉద్యోగం ఇస్తాడని పల్నాడు జిల్లాలోని 527 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలటీల పరిధిలోని సుమారు 7.02 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. టీడీపీ నేతల బూటక హామీలను నమ్మిన తల్లిదండ్రులు తమ పిల్లలు చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలను మాన్పించి కోచింగ్‌ సెంటర్లకు పంపించి ఉద్యోగ నియామకాల పరీక్షలకు సిద్ధం చేయిస్తున్నారు.

నరసరావుపేటతో పాటు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లకు వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. చేస్తున్న ఉద్యోగాలు మానేయడంతో కోచింగ్‌ సెంటర్లకు చెల్లించేందుకు ఫీజులకు, ఇతర ఖర్చులకు ఇంటి నుంచి డబ్బులు అడగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో పెట్టిన సూపర్‌–6లో మొదటి హామీ అయిన 20 లక్షల ఉద్యోగాల కల్పన.. లేకపోతే నెల నెలా రూ.3 వేలు భృతి ఇస్తామని చెప్పారని, దాని ప్రకారం వెంటనే ఎటువంటి షరతులు, నిబంధనలు లేకుండా ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

2019లో అధికారం చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలను కల్పించి పల్నాడు జిల్లాలో 4,703 మంది యువతకు బంగారు భవిష్యత్తు కల్పించారు. అలాగే 10,276 మందికి గ్రామ, వార్డు వలంటీర్‌ పేరిట ఉపాధి కల్పించి వారి ద్వారా ప్రజలకు ఇంటివద్దకే సేవలు అందేలా చేశారు. మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌లో మరో మూడు వేల ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఇతర శాఖల్లో శాశ్వత, కాంట్రాక్టు పోస్టులు భర్తీ చేశారు. అప్కాస్‌ పేరిట వేలాది మందికి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు కల్పించారు. యవతకు ఉద్యోగాలు పొందేందుకు ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ అందజేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాదిరి కూటమి ప్రభుత్వం కూడా శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగాలను కల్పించాలని నిరుద్యోగ యువత డిమాండ్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement