జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై 93 అర్జీలు అందజేశారు. వీటిలో 21 రెవెన్యూ క్లినిక్ ద్వారా భూసమస్యలపై జాయింట్ కలెక్టర్ సంజనా సింహ స్వీకరించారు. నరసరావుపేట డివిజన్‌కు చెందిన 12, సత్తెనపల్లి 5, గురజాల నాలుగు ఉన్నాయి. కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఆదేశించారు.


