రసాభాసగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

రసాభాసగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

రసాభాసగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా వేడుకలు

20వ వార్డులో బీసీ, సీఎం సామాజిక వర్గీయుల మధ్య భేదాలు బీసీ వర్గీయులు ఏర్పాటుచేసిన కేక్‌ కట్‌చేయని ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసిన బీసీ వర్గీయులు

నరసరావుపేట: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు శుక్రవారం సాయంత్రం పట్టణంలోని 20వ వార్డులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం రసాభాసగా కొనసాగింది. సీఎం సామాజిక వర్గీయులు వ్యవహరించిన తీరుతో పార్టీలోని బీసీలు నిరసనలకు దిగే పరిస్థితి ఏర్పడింది. కార్యక్రమం సందర్భంగా పార్టీకి చెందిన బీసీ వర్గీయులు డాక్టర్‌ చదలవాడను తమ వాడిగా భావిస్తూ ఆ వార్డులో నివాసం ఉంటున్న మున్సిపల్‌ కార్మికులతో కలిసి ఆయన చేత కేక్‌ కట్‌చేయించాలనే ఉద్దేశ్యంతో అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. వార్డుకు వచ్చిన ఎమ్మెల్యేను సీఎం సామాజిక వర్గీయులు కొందరు ఒత్తిడి చేసి కేకు కట్‌ చేయనీయకుండా తమ బజారుకు తీసుకెళ్లటంతో బీసీ వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తూ రెండో వర్గానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేకు కట్‌ చేయకుండా దాని పక్కగా వెళుతూ కూడా తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యేపై బీసీ వర్గీయులు, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎమ్మెల్యేతో పాటు వచ్చిన పలువురు టీడీపీ నాయకులు సైతం ఎమ్మెల్యేకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదని సమాచారం. దీనిపై బీసీ సంక్షేమ సంఘానికి చెందిన వారు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు.

వినుకొండ: పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెల్లటూరు రోడ్డులోని గుడ్‌ షెఫర్డ్‌ స్కూల్‌లో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్పెషల్‌ ఆఫీసర్‌ డ్వామా పీడీ సిద్ధా లింగమూర్తి మార్గదర్శకంలో మున్సిపల్‌ కమిషనర్‌ కోడూరు శివరాంప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఇస్మాయిల్‌, స్కూల్‌ డైరెక్టర్‌ ఇన్నారెడ్డి, ప్రిన్సిపల్‌ సునీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement