బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి నరసరావుపేట: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్‌ను నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట ప్రాంతాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ఆపరేషన్స్ డివిజనల్ ఇంజినీర్ గుంటుపల్లి చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. బీఎస్‌ఎన్‌ఎల్ ‘ఫ్రీడం 2.0 ఆఫర్ ప్లాన్’ బంపర్ ఆఫర్ మరల రీ లాంచ్ కారణంగా కేవలం రూ.1తో ఫ్రీ సిమ్, పగలు ఒక జీబీ డేటా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు 24 రోజులు వస్తుందని తెలిపారు. ఈ ఆఫర్ ఈనెల 12 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు ఉంటుందని, ఈ సదావకాశం వినియోగించుకొని కొత్త సిమ్ తీసుకోవాలని కోరారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ కనెక్షన్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ కూడా అందుబాటులో ఉందని, రూ.499 ప్లాన్‌నపై మొదటి క్యాలెండర్ నెల ఉచితంగా లభించడంతోపాటు, తదుపరి మూడు నెలలకు నెలకు రూ.100 చొప్పున డిస్కౌంట్ లభిస్తుందన్నారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు
దరఖాస్తులు ఆహ్వానం నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలో 167 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికిగాను సెప్టెంబర్ 1 నుంచి 2027 ఏప్రిల్ 30వ తేదీ వరకు 8 నెలల పాటు పనిచేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా పరిధిలో స్కూల్ అసిస్టెంట్స్ 134 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ 33 పోస్టులకు నియామకాలు జరుపుతున్నట్టు వివరించారు. వీరిలో ఎస్‌ఏ పోస్టులకు నెలకు రూ.12,500, ఎస్‌జీటీలకు నెలకు రూ.10వేలు గౌరవ వేతనం అందిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆయా మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో ఈనెల 16 నుంచి 21వ తేదీ లోపు సమర్పించాలని స్పష్టం చేశారు. అభ్యర్థుల అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలకు ఆయా ఎంఈఓ కార్యాలయాలలో సంప్రదించాలని సూచించారు. ప్రజాకవి కరీముల్లాకు
మల్లె తీగ గిడుగు సేవా పురస్కారం గంజాయి కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు నరసరావుపేటటౌన్: అక్రమంగా గంజాయి కలిగి న కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గుంటూరు మొ దటి అదనపు జిల్లా జడ్జి శుక్రవారం తీర్పు చెప్పినట్లు వన్‌న్ టౌనన్ సీఐ షేక్ ఫిరోజ్ తెలిపారు. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద 2017 ఆగస్టు 5వ తేదీన బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ద్వారకానగర్‌కు చెందిన కొలికి చిరంజీవిని అరెస్టుచేసి అతని వద్ద నుంచి 4.8 కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పటి ఎస్‌ఐలు ఏడుకొండలు, జి.నారాయణలు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారన్నారు. నిందితుడిపై నేరం రుజువుకావటంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారన్నారు. అసెంబ్లీ వర్షాకాల
సమావేశాలకు పటిష్ట భద్రత
డీఈఓ రామారావు
వినుకొండ: సుప్రసిద్ధ కవి కరీముల్లాకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈనెల 23వ తేదీన విజయవాడలో మల్లెతీగ సేవా సాంస్కృతిక సంస్థ మల్లెతీగ గిడుగు రామ్మూర్తి సేవా సాహిత్య పురస్కారం అందజేయనుంది. సంస్థ వ్యవస్థాపకులు కలిమిశ్రీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, గిడుగు రామ్మూర్తి మనుమడు గిడుగు నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ పాల్గొంటారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో కరీముల్లా రాసిన పుస్తకాలు తెలుగు భాషకు వన్నెలద్దాయని నిర్వాహకులు తెలిపారు. అనేక మానవీయ విలువలు, లౌకిక విలువలతో కూడిన కరీముల్లా కవిత్వం సమాజంలో చైతన్యం పెంపొందించడం స్ఫూర్తిదాయకం అన్నారు. ఇప్పటికే ఇరవై ఆరు పుస్తకాలు రాసిన కరీముల్లా కవిత్వంపై అనేక యూనివర్సిటీలలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆంగ్లం, హిందీ, కన్నడ, ఒరియా, ఉర్దూ, బెంగాలీ భాషల్లో అనువాదమైన కరీముల్లా కవిత్వం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది. అమెరికాకు చెందిన తానా సంస్థ కూడా కరీముల్లాకు ప్రశంసాపత్రం పంపింది. తను పుట్టింది ఉర్దూ ముస్లిం కుటుంబంలో అయినప్పటికీ తెలుగు భాషలో విన్నూతమైన పద ప్రయోగాలతో కొత్త శోభను చేకూర్చిన కరీముల్లాను వినుకొండ పట్టణంలోని పలువురు కవులు, కళాకారులుప్రశంసించారు.మహాకవిగుర్రం జాషువా తర్వాత వినుకొండ ప్రాంతం నుంచి తన కవితాశైలితో పేరు తెచ్చుకున్న కరీముల్లా వినుకొండ ముద్దుబిడ్డ అని పలువురు కొనియాడారు.
తాడికొండ: ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం ఏపీ అసెంబ్లీ మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాలులో అడ్వాన్‌న్స్ సెక్యూరిటీ లైజన్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ సంయుక్తంగా నేతృత్వం వహించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పటిష్ట భద్రతా చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు.