వృద్ధురాలిపై దాడి కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై దాడి కేసులో నిందితుడి అరెస్టు

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

రాజుపాలెం: మండలంలోని పెదనెమలిపురిలో ఈనెల 12న వృద్ధురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ డాక్టర్‌ ఎంయూకె చైతన్య శుక్రవారం కేసు వివరాలు వెల్లడించారు. పెదనెమలిపురి గ్రామానికి చెందిన వృద్ధురాలు దిగుమర్తి వెంకట్రావమ్మ మధ్యాహ్నం తన ఇంటిలో నిద్రిస్తుండగా నిందితుడు రాచకొండ శ్రీనివాసరావు ఆమెను చంపుతానని బెదిరించి ఆమె చేతులకు ఉన్న నాలుగు బంగారపు గాజులు, ఒక ఉంగరం లాక్కుని పరారయ్యాడు. సత్తెనపల్లి రూరల్‌ సీఐ పి.కిరణ్‌కుమార్‌, రాజుపాలెం ఎస్‌ఐ సీహెచ్‌ మణికృష్ణలు సిబ్బందితో కలసి రెండు బృందాలుగా ఏర్పడి నిందితుడిని శుక్రవారం కొండమోడు జంక్షన్‌లో పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు బంగారపు గాజులు, ఒక ఉంగరం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని సత్తెనపల్లి కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. త్వరగా కేసును ఛేదించినందుకు సిబ్బందిని అభినందించారు.

నాలుగు బంగారపు గాజులు,

ఒక ఉంగరం స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement