గుంటూరు వెస్ట్: రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల సహకారంతో పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ లేదా ల్యాండ్ పూలింగ్ విధానంపై రైతులతో మంత్రి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ , జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, సీ ఆర్ డీఏఎ అడిషనల్ కమిషనర్లు భార్గవ్ తేజ, కార్తీక్, సంబంధిత శాఖల అధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైల్వే శాఖ ప్రారంభంలో మార్కెట్ ధర ప్రకారం భూసేకరణ చేపట్టాలని నిర్ణయించిందన్నారు. అయితే భూసేకరణ వల్ల తాము నష్టపోతామని, దానికి బదులుగా ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్థానిక రైతులు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. రైతుల విజ్ఞప్తిని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, రైతులతో నేరుగా చర్చించి వారి అభిప్రాయం మేరకే ముందుకు సాగాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి వెల్లడించారు. ఆ మేరకు రైతులతో ఉమ్మడి సమావేశం నిర్వహించి, భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ విధానాలపై ఉన్న సందేహాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా నివృత్తి చేశారని చెప్పారు. రైతులందరికీ పూర్తి అవగాహన కల్పించి, వారి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు త్వరలోనే గ్రామ సభ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డిఓ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలి
జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ
రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ
మంత్రి పి.నారాయణ


