రాజకీయ కుట్రలో భాగంగానే నాగార్జున యాదవ్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కుట్రలో భాగంగానే నాగార్జున యాదవ్‌ అరెస్టు

Jul 13 2026 1:04 AM | Updated on Jul 13 2026 1:04 AM

రాజకీయ కుట్రలో భాగంగానే నాగార్జున యాదవ్‌ అరెస్టు చిలకలూరిపేట: రాజకీయాల్లో ఎగసి పడుతున్న యువ కెరటం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ అరెస్టు అప్రజాస్వామికమని పార్టీ పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఇది రాజకీయాల్లో ఎదుగుతున్న నాగార్జున యాదవ్‌ అణిచివేతకు జరిగిన కుట్రగానే బీసీలు భావిస్తున్నారని వెల్లడించారు. ఎవరిని సంతృప్తి పరచటానికి ఈ అరెస్టు జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, దీనికి తగిన సమాధానం చట్టరీత్యా చెప్పడంతో పాటు వచ్చే ఎన్నికల్లోనూ బీసీల జోలికి వస్తే ఏమవుతుందో చేసి చూపెడతామని హెచ్చరించారు. జిల్లా స్విమ్మింగ్‌ జట్లు ఎంపిక నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాల స్విమ్మింగ్‌ పూల్‌లో జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి హాజరైన స్విమ్మింగ్‌ క్రీడాకారుల నుంచి సబ్‌ జూనియర్‌, జూనియర్‌ బాలబాలికల జట్లు ఎంపికలు నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18, 19 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న 11వ ఆంధ్రప్రదేశ్‌ సబ్‌–జూనియర్‌, జూనియర్‌ అంతర్‌ జిల్లాల చాంపియన్‌ షిప్‌– 2026 పోటీలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్‌ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. 7 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ప్రత్యేకంగా స్విమ్మింగ్‌ గాలా–2 పోటీలు నిర్వహించారు. జిల్లా జట్టు ఎంపిక పోటీలను సీనియర్‌ స్విమ్మింగ్‌ కోచ్‌ జి.సురేష్‌ పర్యవేక్షించారు. జట్టుకు ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఏ.ఏ.రామలింగారెడ్డి, సభ్యులు అభినందించారు. ఐఏపీ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా డాక్టర్‌ ఉమాజ్యోతి డాక్టర్‌ వీవీ రామ్‌కుమార్‌కు జాతీయ పురస్కారం

వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్‌ గౌడ్‌

గుంటూరు మెడికల్‌: ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ(ఐఏపీ) ఏపీ స్టేట్‌ బ్రాంచ్‌ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా గుంటూరు జీజీహెచ్‌ మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి డాక్టర్‌ నీలి ఉమాజ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విశాఖపట్నంలో మానసికవ్యాధి వైద్య నిపుణుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్‌ ఉమాజ్యోతిని మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర శాఖకు ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఈమె రాష్ట్ర శాఖలో వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. డాక్టర్‌ ఉమాజ్యోతి 1999 నుంచి సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా, రాష్ట్ర సంఘంలో పలు హోదాల్లో సేవలందించారు. ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్‌ ఉమాజ్యోతికి మానసికవ్యాధి వైద్య నిపుణుల సంఘం గుంటూరు ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వడ్డాది వెంకటకిరణ్‌, సెక్రటరీ డాక్టర్‌ పసుపుల సాయి కిరణ్‌, ఇతర సంఘ నేతలు, గుంటూరు జీజీహెచ్‌ మానసికవ్యాధుల వైద్య విభాగానికి చెందిన వైద్యులు, జీజీహెచ్‌, గంటూరు వైద్య కళాశాల అధికారులు, వైద్యులు అభినందనలు తెలిపారు.

గుంటూరు మెడికల్‌: గుంటూరుకు చెందిన ప్రముఖ మధుమేహవైద్యనిపుణులు, ఎస్వీఆర్‌ షుగర్‌ హాస్పిటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ వీవీ రామకుమార్‌ ఆదివారం జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జ్యోతి దేవ్‌ ప్రొఫెషనల్‌ ఎడ్యుకేషన్‌ ఫోరం– 2026 సంవత్సరానికి ‘పేషెంట్‌ ఎంపవర్మెంట్‌ డిజిటల్‌ ఎంగేజ్మెంట్‌ అండ్‌ పేషెంట్‌ ఎడ్యుకేషన్‌ ఇన్షియేటివ్స్‌‘ విభాగంలో ప్రముఖ మధుమేహ నిపుణులు పద్మశ్రీ డాక్టర్‌ శశాంక్‌ జోషి, త్రివేండ్రం గోకులం హాస్పిటల్‌ చైర్మన్‌ మనోజ్‌ చేతుల మీదుగా డాక్టర్‌ రామ్‌కుమార్‌ జాతీయస్థాయి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రామ్‌ కుమార్‌ మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా షుగర్‌ వ్యాధిపై వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జాతీయ పురస్కారాన్ని అందుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. తన ఆత్మీయ పేషెంట్లకు, సహచర వైద్య బృందానికి, విద్య నేర్పిన గురువులకు, కుటుంబ సభ్యులకు డాక్టర్‌ రామ్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement