తెనాలి: మానవాళితో గ్రహాంతరవాసుల సహజీవనం కథాంశంతో మా–ఏపీ నుంచి నూతన దర్శకుడు స్టైల్ రవి రూపొందిస్తున్న ’గ్రహాంతర ప్రేమికుడు’ ఓటీటీ చిత్రం ఒక వినూత్న ప్రయోగమని మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్‌రాజా చెప్పారు. తెనాలిలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రహాంతర వాసులు... ఏలియన్స్ ఉనికిని నేచర్ అస్ట్రానమి జర్నల్ సైంటిస్టులు ధ్రువీకరించారని దిలీప్‌రాజా చెప్పారు. దర్శకుడు స్టైల్ రవి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు వెల్లడించిన పరిశోధనల నుంచి స్ఫూర్తి పొందామని చెప్పారు. ఈ చిత్రంలో భవానీ కపూర్, రమ్య రాథోడ్, సముద్రాల శ్రీధర్ శర్మ, యశ్వంత్ చంద్ర, బెల్లంకొండ వెంకట్, తుమ్మా పాపారావు, మల్లెపాడు రమేష్, సైదులు నటిస్తున్నారని తెలిపారు.


