ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్
లక్ష్మీపురం: రైతుల ఆమోదంతో దేవతల రాజధాని నిర్మిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు దీనికి భిన్నంగా రైతుల పచ్చని పంట పొలాలను ఒక్కసారిగా ధ్వంసం చేయటమే కాకుండా అడ్డు వచ్చిన రైతులను కూడా విచక్షణారహితంగా ఈడ్చివేయడం అన్యాయమని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు కార్యాలయంలో శనివారం మాట్లాడారు. చూస్తుంటే ప్రశాంతమైన రాజధాని నిర్మాణం జరిగేటట్టు కనబడట్లేదని అభిప్రాయపడ్డారు. రాజధాని పరిధిలోనే ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో భూములు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదనలును రైతుల ఆమోదించి మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 9వ తేదీ ఉండవల్లిలో సీఆర్డిఏ అధికారులు గ్రామ సభ జరిపి రైతుల ప్రమేయం లేకుండా, చర్చించకుండా ఎటువంటి నిర్ణయం చేయబోమని చెప్పిన రెండు రోజులు గడవక ముందే పోలీసులను రంగంలో దింపి పచ్చని పంట పొలాలును పొక్లెయిన్‌లతో ధ్వంసం చేయటం దుర్మార్గమైన, సహించరాని చర్య అన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన రైతుల పైన ఈ విధంగా వ్వహరించటం అంటే భవిష్యత్‌లో దీని తగిన మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ దుందుడుకు చర్యలను ఉపసంహరించుకొని రైతు పక్షపాతిగా వారు కోరిన మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించి న్యాయం చేయాలని అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.
తెనాలిరూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడ– చైన్నె రైలు మార్గంలోని చుండూరు– మోదుకూరు స్టేషన్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని జీఆర్పీ పోలీసులు శనివారం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎల్.సరస్వతి తెలిపారు.


