అండగా మేమంతా ఉన్నాం
కారంచేడు: అనారోగ్యంతో కొంత కాలంగా చికిత్స పొందుతున్న కారంచేడు జెడ్పీటీసీ సభ్యురాలు యార్లగడ్డ రజనీ శ్రీనివాసరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కలిసి పరామర్శించారు. మంగళవారం మండల కేంద్రమైన కారంచేడు గ్రామంలోని జెడ్పీటీసీ సభ్యురాలి గృహానికి వచ్చిన బత్తుల ఆమెను చూసి చలించిపోయారు. ఎంతో యాక్టివ్‌గా ఉండేవారన్నారు. అనారోగ్యాలను బట్టి కృంగి పోకూడదని, ధైర్యంగా ఉండాలని, మేమంతా మీకు అండగా ఉంటామని ఆమె ఽధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. చికిత్స జరుగుతున్న తీరును కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండి అనారోగ్యాన్ని జయించి మరలా మండలంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. స్టేట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పి. ఏడుకొండలు, యర్రం లక్ష్మారెడ్డి, గోగినేని బుల్లెబ్బాయి, యార్లగడ్డ శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
జెడ్పీటీసీ రజనీని పరామర్శించిన
బత్తుల బ్రహ్మానంద రెడ్డి


