యూరియా కోసం పాట్లు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం పాట్లు

Dec 28 2025 8:26 AM | Updated on Dec 28 2025 8:26 AM

యూరియ

యూరియా కోసం పాట్లు

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 యూరియా కోసం పాట్లు యార్డు సిబ్బంది తీరుపై రైతుల ఆగ్రహం దాచేపల్లి: మార్కెట్‌ యార్డు సిబ్బంది తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నడికుడి వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్దకు శనివారం యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. యూరియా ఇచ్చేందుకు సిబ్బంది రైతులకు కూపన్లు పంపిణీ చేశారు. ఒక్కొక్క రైతుకు రెండు బస్తాల యూరియాతోపాటుగా రూ.266 విలువ చేసే నానో యూరియా డబ్బా కూడా తీసుకోవాలంటూ సిబ్బంది మెలిక పెట్టారు. నానో యూరియా డబ్బా తీసుకునేందుకు రైతులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో యూరియా పంపిణీ చేయకుండా సిబ్బంది తాళాలు వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. రైతులు మండల వ్యవసాయశాఖ అధికారి కంచర్ల వెంకటేష్‌కి జరిగిన విషయాన్ని ఫోన్‌ ద్వారా తెలియజేశారు. స్పందించిన ఏవో యార్డు సిబ్బందితో మాట్లాడి త్వరగా వెళ్లి యూరియా బస్తాలు రైతులకు ఇవ్వాలని సూచించారు. కానీ సిబ్బంది యార్డుకు రాలేదు. ది గుంటూరు జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్రాంచ్‌ దాచేపల్లి ద్వారా 220 యూరియా బస్తాలు మార్కెట్‌ యార్డులో దిగుమతి కాగా రైతులకు పంపిణీ చేసినట్లు నోటీసు బోర్డులో రాశారు. ఇది పరిశీలించిన రైతులు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఒక్కొ రైతుకు రెండు బస్తాల యూరియాతోపాటుగా నానో యూరియా డబ్బా ఇస్తామని చెబుతున్నారని, నానో యూరియా వలన పంటలకు ఎటువంటి ప్రయోజనం లేదని రైతులు పేర్కొన్నారు. ఏవో వెంకటేష్‌ మార్కెట్‌ యార్డు వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా బస్తాలు పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. బలవంతంగా రైతులకు నానో యూరియా డబ్బాలు కట్టబెట్టవద్దని, కావాల్సిన రైతులకు మాత్రమే ఇవ్వాలని ఏఓ సిబ్బందికి సూచించారు. ఏఓ సమక్షంలో యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశారు.

న్యూస్‌రీల్‌

శ్రీవారికి ధనుర్మాస పూజలు

పల్నాడు
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025
యార్డు సిబ్బంది తీరుపై రైతుల ఆగ్రహం

యూరియా కోసం భారీగా

వచ్చిన రైతులు

బస్తాలతో పాటు నాన్‌ యూరియా

డబ్బా తీసుకొవాలంటూ మెలిక

నాన్‌ యూరియా తీసుకునేందుకు

నిరాకరణ

తాళాలు వేసుకుని వెళ్లిపోయిన

సిబ్బంది

ఆందోళనకు దిగిన రైతులు

చేసేది లేక యూరియా పంపిణీ

నగరం: బాపట్ల జిల్లా జిల్లేపల్లి గ్రామంలోని

శ్రీ వేంటేశ్వరస్వామి దేవస్థానంలో ధనుర్మాసం పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం చేపట్టారు.

యూరియా కోసం పాట్లు1
1/4

యూరియా కోసం పాట్లు

యూరియా కోసం పాట్లు2
2/4

యూరియా కోసం పాట్లు

యూరియా కోసం పాట్లు3
3/4

యూరియా కోసం పాట్లు

యూరియా కోసం పాట్లు4
4/4

యూరియా కోసం పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement