క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు | Sakshi
Sakshi News home page

క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Published Sat, Nov 18 2023 2:00 AM

- - Sakshi

ఏఎన్‌యూ(గుంటూరు): యూనివర్సిటీలో క్రీడా రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వైస్‌ చాన్సలర్‌ పి.రాజశేఖర్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అంతర్‌ జిల్లాల బాస్కెట్‌ బాల్‌ పోటీలను శుక్రవారం సాయంత్రం వీసీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసంగిస్తూ ఏఎన్‌యూ వేదికగా అనేక జాతీయ, జోనల్‌ స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించామన్నారు. క్రీడా రంగంలో దేశానికే తలమానికంగా నిలిచే అనేక మౌలిక వసతులు ఏఎన్‌యూలో ఉన్నాయని తెలిపారు.

ఏఎన్‌యూకు క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బి హరి ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీవీఐటీ చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, ఏఎన్‌యూ వ్యాయామ విద్య డైరెక్టర్‌ ఆచార్య పి.జాన్సన్‌, మాజీ డైరెక్టర్‌ ఆచార్య వై.కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోటీలలో పాల్గొంటున్న జట్ల క్రీడాకారులను అతిథులు పరిచయం చేసుకున్నారు.

ఏఎన్‌యూ వైస్‌ చాన్సలర్‌ రాజశేఖర్‌

రాష్ట్ర స్థాయి అంతర్‌ జిల్లాల

బాస్కెట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

తొలిరోజు పోటీల వివరాలు

తొలిరోజు ఈస్ట్‌ గోదావరి నెల్లూరు జిల్లాల మధ్య జరిగిన పోటీలో ఈస్ట్‌ గోదావరి 30:27 తేడాతో విజయం సాధించింది. కోనసీమ, నంద్యాల జిల్లాల మధ్య జరిగిన పోటీలో నంద్యాల జిల్లా 37: 17 తేడాతోను, విశాఖపట్నం, కర్నూలు మధ్య జరిగిన పోటీలో విశాఖపట్నం జట్టు 55: 21 పాయింట్లతోను, అనకాపల్లి, అన్నమయ్య జిల్లాల మధ్య పోటీలో అనకాపల్లి జిల్లా 37: 27 తేడాతో విజయం సాధించాయి.

Advertisement
 
Advertisement