శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని జీటీరోడ్డు ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఏటీఎం వద్ద ఓ వ్యక్తి డిపాజిట్ చేసిన రూ. 17 వేలు తిరిగొచ్చేశాయని, ఆ డబ్బులు వేరే కష్టమర్ పట్టుకుపోగా గుర్తించి వెనక్కి ఇప్పించామని ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ వెల్లడించారు. నగరానికి చెందిన ముద్దాడ వంశీకృష్ణ అనే యువకుడు గత నెల 8న ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఏటీఎం వద్ద క్యాష్ డిపాజిట్ మిషన్‌లో రూ. 17 వేలు డిపాజిట్ చేశాడు. నగదు బ్యాంకు ఖాతాలోకి మళ్లిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడికి కొద్ది సెకెండ్లలోనే మిషన్‌నుంచి నోట్లు తిరిగి రావడంతో వెనకున్న కస్టమర్ తీసుకుని వెళ్లిపోయాడు. ఇంటికెళ్లి చూసుకున్నాక ఖాతాలో సొమ్ము చేరనట్లు ఫోన్ ద్వారా తెలుసుకున్న వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సమక్షంలో సిబ్బంది మ్యాట్రిక్స్ సీసీ కెమెరాల ద్వారా నగదును తీసుకుపోయిన కస్టమర్‌ను గుర్తించి స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అతని వద్ద నగదును స్వాధీనం చేసుకున్న ఎస్‌ఐ హరికృష్ణ బాధితుడైన వంశీకృష్ణను స్టేషన్‌కు పిలిపించి అప్పగించారు.


