పర్లాకిమిడి: గజపతిజిల్లా రాయగడ బ్లాక్ కోయిపూర్ వద్ద 23వ జాతీయ బైసైక్లింగ్ చాంపియన్‌షిప్‌ను బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అక్టోబర్ 4 వరకూ జరగునున్న ఈ బైసైక్లింగ్ చాంపియన్ షిప్ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి బైసైకిల్ క్రీడాకారులు మహేంద్రగిరికి చేరుకున్నారు. ఈ పోటీలకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, జిల్లా పరిషత్ సీడీఓ దయామయ పాఢి, సబ్‌కలెక్టర్ భగత్ సామల్ కళ్యాణ్ రావ్, జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సాలేంద్ర పాఠక్, ఒడిషా సైక్లింగ్ అసోసియేషన్ సంపాదకులు ప్రసన్న కుమార్ రౌత్, అధ్యక్షులు మింటి మహాపాత్రోలు పాల్గొన్నారు. కొయిపూర్ గ్రామం నుంచి మహేంద్రగిరి బుర్‌ఖాత్‌పాస్ వరకూ సైక్లింగ్ పోటీలు జరిగాయి. సుందరమైన సుదూర వాతావరణంలో మహేంద్రగిరి సహాజ వాతావరణంలో ఈ బైసైక్లింగ్ పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి అన్నారు.


