కొరాపుట్: న్యూఢిల్లీలోని ప్రఖ్యాత హిందూ కళాశాల స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్‌గా నబరంగ్‌ఫూర్ జిల్లాకి చెందిన సారా ఖాన్ గెలిపొందారు. జిల్లాకి చెందిన ప్రముఖ ఒడియా సినీహీరో, బీజేడీ పార్టీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు మున్నా ఖాన్ కుమార్తే సారా ఖాన్. ఈమె కళాశాలలో హిస్టరీ విభాగంలో ప్లస్ 3లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సారా ఖాన్ స్వస్థలం నబరంగ్‌పూర్ జిల్లాలోని తారాగాం గ్రామం. జిల్లాకి చెందిన సారాఖాన్ గెలుపొందడంపై విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఉద్యోగుల స్వచ్ఛసేవా
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు స్వచ్ఛ సేవా–2026 కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఉదయం కార్యాలయ ఆవరణలో చీపుర్లు పట్టుకొని శుభ్రపరిచారు. కార్యాలయానికి వచ్చిన సందర్శకులు తమ తమ ప్రాంతాలను స్వచ్ఛంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఎ పీడీ బిరంచి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కవిటి: జగతి గ్రామానికి చెందిన దిక్కల అభిమ న్యు జేఆర్‌ఎఫ్ ఎంట్రన్స్ లో 12వ ర్యాంక్ సాధించాడు. ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం పరిధిలోని బాపట్ల కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసిన అభిమ న్యు ఇటీవల జాతీయస్థాయిలో నిర్వహించిన జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రవేశపరీక్షలో ఈ ర్యాంకు సాధించాడు. అభిమన్యు విజయం పట్ల తల్లిదండ్రులు దిక్కల జగదీష్, సనపల మంజుల(జిల్లాకోర్టు సీనియర్ స్టెనోగ్రాఫర్), గ్రామపెద్దలు పూడి నేతాజీ, పూడి వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.
రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి విజయనగ రం వెళుతున్న ఆర్టీసీ బస్సు గురువారం మధ్యా హ్నం కోష్ఠ జంక్షన్‌లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న సంచాం గ్రామానికి చెందిన గొర్లె హేమంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని జె.ఆర్.పు రం ఎస్సై వి.సత్యనారాయణ పరిశీలించారు. కోస్టాలో ఆటోలు, ఇతర దుకాణాలు ఫుట్‌పాత్‌పై ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
టెక్కలి రూరల్: రావివలసలో కె.కాంతమ్మకు చెందిన రేకు ఇల్లు గురువారం దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో సామగ్రీ మొత్తం కాలిపోయింది. స్థానికులు మంటలు ఆపే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది.
ఎచ్చెర్ల : మండలంలోని నవభారత్ జంక్షన్ వద్ద వరం కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న యతిరాజుల పద్మావతి (41) అనే వివాహిత బుధవారం ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మావతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. సంతానం కూడా లేదు. దీంతో మనస్థాపానికి గురై భర్త లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందింది. వీరి స్వగ్రామం ఆమదాలవలస కాగా, కొంతకాలంగా వరం కాలనీలో ఉంటున్నారు. ఈమె భర్త శ్రీనివాసరావు రణస్థలం మండలం కొచ్చెర్లలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తమ్ముడు బుడుమూరు ప్రభాకరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: సమస్యల పరిష్కారం కోరుతూ రెండో రోజు గురువారం కూడా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జిల్లాకు మంజూరైన కొత్త కోర్టులు జిల్లా కోర్టు ఆవరణలోనే ఏర్పాటు చేయాలని, ఇతర న్యాయపరమైన వృత్తిపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారావు, కార్యదర్శి చిట్టి సూర్యనారాయణ, బీసీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆగూరి ఉమామహేశ్వరరావు, అసో సియేషన్ సభ్యులు డి.ఈశ్వరరావు, సుభాష్, విజయ్‌కుమార్, ఏఎల్‌ఎన్, కొమ్ము రమణమూర్తి, భవానీ శంకర్ పాల్గొన్నారు.


