భువనేశ్వర్: విద్య, పరిశోధన రంగాల్లో అవగాహన పటిష్టత కోసం కేఐఎస్‌టీ, సీఎస్‌ఐఆర్– ఐఎంఎంటీ మధ్య ఒప్పందం కుదిరింది. ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థ జట్నీ కోణార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కేఐఎస్‌టీ), ప్రఖ్యాత పరిశోధనా సంస్థ ిసీఎస్‌ఐఆర్–ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. విద్య, సాంకేతికత, ఉన్నత పరిశోధన రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ిసీఎస్‌ఐఆర్– ఐఎంఎంటీ 85వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఎంఓయూ ప్రకారం రెండు సంస్థలు సంయుక్తంగా అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థుల అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ మరియు అంతర్జాతీయ సెమినార్లు, సాంకేతిక వర్కుషాపులు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తాయి. దీనివల్ల కేఐఎస్‌టీ విద్యార్థులు, అధ్యాపకులు ిసీఎస్‌ఐఆర్– ఐఎంఎంటీ శాస్త్రవేత్తల పరిశోధనా నైపుణ్యం నుంచి నేరుగా ప్రయోజనం పొందగలుగుతారు. ఈ సంతకాల కార్యక్రమంలో కేఐఎస్‌టీ తరఫున డీన్ డాక్టర్ సూర్య నారాయణ్ పట్నాయక్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ చంద్రకాంత్ మిశ్రా పాల్గొన్నారు. ఈ ఒప్పందం విద్యార్థులు, అధ్యాపకులు సాంకేతిక, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను సాధనకు సహాయపడుతుందని కేఐఎస్‌టీ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. కేఐఎస్‌టీ విద్యార్థులు, అధ్యాపకుల జ్ఞాన పునాదిని పెంచుతుందని హైటెక్ గ్రూప్ చీఫ్ ట్రస్టీ, సీఈఓ సురేష్ పాణిగ్రాహి అన్నారు. ఇది కేఐఎస్‌టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడుతుందని కేఐఎస్‌టీ డైరెక్టర్ అనిల్ పాణిగ్రాహి అన్నారు.


